ఆస్కార్ బ‌రిలోనికి  `న్యూట‌న్‌` చిత్రం

Published On: September 23, 2017   |   Posted By:

ఆస్కార్ బ‌రిలోనికి  `న్యూట‌న్‌` చిత్రంImage result for newton movieఆస్కార్ బ‌రిలోనికి  `న్యూట‌న్‌`
90వ ఆస్కార్ చిత్రాల బ‌రిలోకి ఇండియా త‌ర‌పున న్యూట‌న్ చిత్రం మాత్ర‌మే ఎంపికైంది. ఈ విష‌యాన్ని జ్యూరీ ఛైర్మ‌న్ సి.వి.రెడ్డి హైద‌రాబాద్‌లో వెల్ల‌డించారు.

రాజ్‌కుమార్ రావు క‌థానాయ‌కుడు. అమిత్ మ‌స్కూర‌ర్ ద‌ర్శ‌కుడు. సినిమా విడుద‌లైన‌రోజే ఆస్కార్ బ‌రిలోకి సినిమా ఎంపిక‌వ‌డం విశేష‌మ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. గ‌త ఏడాది విశార‌ణై సినిమా ఆస్కార్ పోటీకి వెళ్లింది. భారతదేశంలోని వివిధ భాషల నుంచి మొత్తం 26 చిత్రాలు పోటీపడ్డాయి. అందులో హిందీ నుంచి 12, మరాఠీ నుంచి 5, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ నుంచి 2 చొప్పున, తమిళం నుంచి ఒక చిత్రం పరిశీలనకు వచ్చాయి.

తెలుగు దర్శకనిర్మాత సి.వి.రెడ్డి అధ్యక్షతన 14 మందితో కూడిన ఆస్కార్‌ ఎంపిక బృందం ఆ చిత్రాల్ని పరిశీలించి ‘న్యూటన్‌’ని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ యేడాది నుంచి కేంద్రప్రభుత్వం ఆస్కార్‌కి ఎంపికైన చిత్రానికి రూ.కోటి నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నట్టు ప్రకటించింద‌ని ఈ సంద‌ర్భంగా తెలియజేశారు.