ఇంటిలిజెంట్ ప్రీ-రిలీజ్ బిజినెస్

Published On: February 8, 2018   |   Posted By:
ఇంటిలిజెంట్ ప్రీ-రిలీజ్ బిజినెస్
సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇంటిలిజెంట్. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించారు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసుకుంది. ఇంకా చెప్పాలంటే సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది ఇంటిలిజెంట్ మూవీ. ఓవర్సీస్ లో ఈ సినిమాను సి.కల్యాణ్ సొంతంగా విడుదల చేస్తున్నారు.
ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు
నైజాం – రూ. 6.30 కోట్లు
సీడెడ్ – రూ. 5.40 కోట్లు
ఆంధ్రా – రూ. 13.50 కోట్లు
టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ విలువ – రూ. 25.20 కోట్లు