ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ

Published On: February 9, 2018   |   Posted By:
ఇంటిలిజెంట్ మూవీ రివ్యూ
నటీనటులు – సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌ తదితరులు
కథ, మాటలు: శివ ఆకుల
 సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
 సంగీతం: థమన్‌
 ఎడిటింగ్‌: గౌతంరాజు
 ఆర్ట్‌: బ్రహ్మ కడలి
 ఫైట్స్‌: వెంకట్‌
 డాన్స్‌: శేఖర్‌, జాని
 సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా
 నిర్మాత: సి.కళ్యాణ్‌
 స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌
బ్యానర్ – సీకే ఎంటర్ టైన్ మెంట్స్
సెన్సార్ – u/A
నిడివి – 2గం.10 నిమిషాలు
రిలీజ్ డేట్ – ఫిబ్రవరి 9, 2018
వరుసగా 4 ఫ్లాపులిచ్చాడు. ఆ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఫ్లాపుల నుంచి తప్పులేంటో నేర్చుకొని ఈసారి ఇంటిలిజెంట్ చేశానని ప్రకటించాడు. వినాయక్ డైరక్షన్ లో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఇంటిలిజెంట్. మరి టైటిల్ కు తగ్గట్టు సినిమాలో ఇంటిలిజెన్స్ ఉందా.. మూవీ రిజల్ట్ ఏంటి.. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
సాయిధరమ్ తేజ్ కు చిన్నప్పట్నుంచి ప్రాక్టికల్ గా ఉండడం అలవాటు. మరీ ముఖ్యంగా మంచి చేసినవాళ్లను మరిచిపోకూడదు, వాళ్ల కోసం ఏదైనా చేయాలనే తత్వం. ఈ మంచి విషయాన్ని నాజర్ నుంచి నేర్చుకుంటాడు.  ఎవరికైనా మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందని నమ్మే నాజర్ ను గురువుగా భావిస్తుంటాడు సాయిధరమ్ తేజ్. అతడి అడుగు జాడల్లోనే పెరిగి పెద్దవాడవుతాడు. నాజర్ పెట్టిన కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేరతాడు. అంతేకాదు..నాజర్ కూతురు లావణ్య త్రిపాఠి, తేజు ప్రేమించుకుంటారు.
సరిగ్గా ఇదే టైమ్ లో మాఫియా డాన్ రాహుల్ దేవ్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. నాజర్ ను చంపేసి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తాడు. నాజర్ సాఫ్ట్ వేర్ కంపెనీని తను సొంతం చేసుకుంటాడు. గురువును చంపిన రాహుల్ దేవ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు సాయిధరమ్ తేజ్. ఓ వ్యక్తిగా అతడ్ని ఎదిరించే కంటే.. తన తెలివితేటలతో ఓ శక్తిగా మారతాడు. ఈ క్రమంలో ధర్మాభాయ్ గా మారతాడు. కేవలం నాజర్ ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా.. మంచి చేసే వాళ్లకు మంచే జరుగుతుందనే మెసేజ్ ను తనదైన స్టయిల్ లో జనాల్లోకి చేరవేస్తాడు. ఇది ఇంటిలిజెంట్ స్టోరీలైన్.
ప్లస్ పాయింట్స్
– సాయిధరమ్ తేజ్ యాక్టింగ్, డాన్స్
– సప్తగిరి కామెడీ సన్నివేశాలు
– కళామందిర్ సాంగ్
– ఇంటర్వెల్ ఫైట్
– రీరికార్డింగ్
మైనస్ పాయింట్స్
– వినాయక్ డైరక్షన్
– నాసిరకం ప్రొడక్షన్ వాల్యూస్
– కథలో దమ్ములేకపోవడం
– హీరోయిన్ పెర్ఫార్మెన్స్
– ఎడిటింగ్
– యాక్షన్ సన్నివేశాల్లో లోపాలు
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
ఇంటిలిజెంట్.. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్టే. కానీ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విషయాల్లో మాత్రం ఈ టైటిల్ అస్సలు సూట్ కాదు. కథ ఎంపిక నుంచి, దాన్ని చెప్పే విధానం వరకు ఎక్కడా దర్శకుడి ఇంటిలిజెన్స్ కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఈ కథ కూడా వినకుండా సాయిధరమ్ తేజ్ ఓకే చేశాడేమో అనిపిస్తుంది. అంత రొటీన్ స్టోరీ ఇది.
నటీనటుల విషయానికొస్తే… కథ రొటీన్ అయినప్పటికీ సాయిధరమ్ తేజ్ తన వంతు ప్రయత్నం మాత్రం చేశాడు. యాక్టింగ్, డాన్సింగ్ అన్నీ చక్కగా చేశాడు. ఈసారి తేజూ కొత్తగా ఏదైనా చేశాడంటే అది చిరంజీవిని ఇమిటేట్ చేయడమే. ఛమక్ ఛమక్ సాంగ్ లో చిరంజీవిని యాజ్ ఇటీజ్ దించేశాడు. చాలా సన్నివేశాల్లో చిరంజీవి యాక్టింగ్ ను మక్కికి మక్కి దించేశాడు. కేవలం తేజూను చిరంజీవిగా చూపించడం కోసమే వినాయక్ ఈ సినిమా తీశాడేమో అని అనిపించకమానదు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన కెరీర్ లో అతి చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక్క ఎమోషన్ పండలేదు. చివరికి ఛమక్ ఛమక్ సాంగ్ బోర్ కొట్టడానికి కూడా లావణ్యే కారణం. ఈ సినిమాకు ఆమె పెద్ద మైనస్. తేజూ, లావణ్య కెమిస్ట్రీ కూడా పండలేదు. సినిమాలో కాస్త మెచ్చుకోదగ్గ అంశం ఏదైనా ఉంటే అది కామెడీ మాత్రమే. సప్తగిరి పండించిన 2-3 కామెడీ సీన్లు బాగా పేలాయి. మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడానికేం లేదు
టెక్నికల్ గా కూడా సినిమా ఉన్నతంగా లేదు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కూసింత రిలీఫ్ ఇస్తుంది. సి.కల్యాణ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించిన స్థాయిలో లేవు. శివ ఆకుల కథ-స్క్రీన్ ప్లే, వినాయక్ దర్శకత్వం పాతకాలం సినిమాను గుర్తుచేస్తాయి. క్లయిమాక్స్ కు వచ్చేసరికి ఫక్తు తెలుగు సినిమా టైపులో  హీరో కుటుంబాన్ని, ఫ్రెండ్స్, ప్రేయసిని విలన్ కిడ్నాప్ చేయడం.. వారిని వెతుక్కుంటూ హీరో వచ్చి విలన్‌ను చంపి రివెంజ్ తీర్చుకోవడం.. ఇలా బాగా విసిగిస్తాడు దర్శకుడు వినాయక్.
సప్తగిరి కామెడీతో పాటు కళామందిర్ సాంగ్, ఇంటర్వెల్ ఫైట్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. మిగతావన్నీ మైనస్ ల కింద వేసుకోవచ్చు. బాహుబలి, ఫిదా, అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు లాంటి విలక్షణమైన సినిమాలు చూసిన కళ్లతో ఈ పరమ రొటీన్ ఇంటిలిజెంట్ ను చూడలేం.
ఓవరాల్ గా ఇంటిలిజెంట్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించదు.
రేటింగ్ – 2.5/5

Movie title:- Intelligent

Banner:-  C K Entertainments

Release date:-09.02.2018

Censor Rating:-“U/A”

Cast:- Sai Dharam Tej,Lavanya Tripathi, Brahmanandam ,Nassar, Posani Krishna Murali

Story:-Akula Siva

Screenplay:- V V Vinayak

Dialogues:- Akula Siva

Directed by:- V V Vinayak

Music:-Thaman S

Cinematography:-S V Vishweswar

Editing:- Gowtham Raju.

Producer:- C.Kalyan

Run Time:- 130 minutes