ఇంద్రసేన ట్రయిలర్ రివ్యూ

Published On: October 12, 2017   |   Posted By:

ఇంద్రసేన ట్రయిలర్ రివ్యూ


సినిమాపై అంచనాలు పెంచాలంటే ఒక్క ట్రయిలర్ చాలు. అప్పటివరకు ఆ సినిమాను పట్టించుకోకపోయినా, ఆ ఒక్క ట్రయిలర్ తో సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. నలుగురు మాట్లాడుకునేలా చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఆసక్తినే రేకెత్తించింది ఇంద్రసేన ట్రయిలర్. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

“స్ట్రయిట్ గా వెళ్లి రైట్ తీసుకుంటే ఒక ఓటమి ఎదురవుతుంది. దాన్నుండి లెఫ్ట్ కు వెళ్తే పెద్ద నమ్మక ద్రోహం కనిపిస్తుంది.”.. ఇలా ఓ గంభీరమైన వాయిస్ ఓవర్ తో సాగింది ఇంద్రసేన ట్రయిలర్. ఏదో అడ్రస్ చెప్పినట్టు జీవితంలో ఎత్తుపల్లాల్ని ట్రయిలర్ లో చెప్పిన విధానం అద్భుతంగా ఉంది. దీనికి తోడు ప్రతి వాక్యానికి ట్రయిలర్ లో చూపించిన విజువల్ ను సింక్ చేసిన పద్ధతి ఇంకా బాగుంది. ఇంద్రసేన అనే వ్యక్తి జీవితంలో మలుపుల్ని, ఎదుర్కొన్న పరాభవాల్ని, మోసపోయిన విధానాన్ని ఇందులో చూపించారు. ఇంకా చెప్పాలంటే సమాజంలో ఓ వ్యక్తి జీవితమే ఇంద్రసేన సినిమా.

ఎప్పట్లానే ట్రయిలర్ లో విజయ్ ఆంటోనీ లుక్ అదిరిపోయింది. విభిన్న పరిస్థితుల్లో విజయ్ ఆంటోనీ చూపించిన ఎక్స్ ప్రెషన్స్, వేరియేషన్స్ చాలా బాగున్నాయి. తన ప్రతి సినిమాకు ఓ వినూత్నమైన కథాంశాన్ని ఎంచుకునే ఈ హీరో, ఇంద్రసేన కోసం కూడా అలాంటిదే ఓ డిఫరెంట్ స్టోరీలైన్ ఎన్నుకున్నాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

టెక్నికల్ గా కూడా ట్రయిలర్ రిచ్ గా ఉంది. విజయ్ ఆంటోనీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రయిలర్ కు అల్టిమేట్ ఫీల్ తీసుకొచ్చింది. ఇక ఈ ట్రయిలర్ ను ఎడిట్ చేసింది కూడా విజయ్ ఆంటోనీనే కావడం విశేషం. అంతేకాదు.. ఈ సినిమా నిర్మాతల్లో కూడా విజయ్ ఆంటోనీ ఒకరు. ఇలా అన్నీ తానై విజయ్ ఆంటోనీ తెరకెక్కించిన ఇంద్రసేన్ ట్రయిలర్ సినిమాపై అంచనాల్ని పెంచే విధంగా ఉంది.