ఇంద్ర‌గంటితో సుధీర్‌?

Published On: September 4, 2017   |   Posted By:

 ఇంద్ర‌గంటితో సుధీర్‌?

‘జెంటిల్‌మ‌న్‌’, ‘అమీతుమీ’ చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ఈ రెండు విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత ఇంద్రగంటి త‌దుప‌రి చిత్రంపై ప్రేక్ష‌కుల్లో ఆసక్తి నెల‌కొంది. దీని గురించి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త‌ల‌ ప్ర‌కారం.. ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు సుధీర్ బాబు న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లే ‘శ‌మంత‌క‌మ‌ణి’ వంటి మ‌ల్టీస్టార‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించిన సుధీర్‌.. కొత్త చిత్రాల విష‌యంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడ‌ట‌. అందులో భాగంగానే.. ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ట‌. ఇంద్ర‌గంటి, సుధీర్ కాంబినేష‌న్‌లో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి.