ఇది నా ల‌వ్‌స్టోరీ మూవీ రివ్యూ

Published On: February 14, 2018   |   Posted By:
ఇది నా ల‌వ్‌స్టోరీ మూవీ రివ్యూ
బ్యాన‌ర్:  రామ్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌
న‌టీన‌టులు: తరుణ్‌, ఓవియా, ఖయ్యుమ్‌, చిట్టిబాబు, జగదీష్‌, అనిల్‌ తదితరులు
సంగీతం: శ‌్రీనాథ్ విజ‌య్‌,
ఎడిటర్‌: శంకర్‌
కెమెరా: క్రిస్టోపర్‌ జోసెఫ్‌
నిర్మాత: ఎస్‌.వి.ప్రకాష్‌
దర్శకత్వం: రమేష్‌ – గోపి
కెరీర్ ప్రారంభంలో ప్రేమ‌క‌థా చిత్రాల‌తో యూత్‌లో మంచి క్రేజ్‌తో పాటు ల‌వ‌ర్‌బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న న‌టుడు త‌రుణ్‌. త‌ర్వాత విజ‌యాలను అందుకోలేక‌పోవ‌డం.. కొత్త హీరోలు మంచి స‌క్సెస్‌ల‌తో దూసుకు రావ‌డంతో త‌రుణ్ తెర‌మ‌రుగ‌య్యాడు. కొన్ని సంవ‌త్సరాల పాటు త‌రుణ్ సినిమా చేయ‌కుండా.. సైలెంట్ అయిపోయాడు. అస‌లు త‌రుణ్ ఏమ‌య్యాడో కూడా తెలియ‌నంత కామ్ అయిపోయాడు. అయితే మ‌ళ్లీ హీరోగా స‌క్సెస్ సాధించాల‌నే త‌ప‌నో ఏమో కానీ.. క‌న్న‌డంలో విజ‌యవంత‌మైన `సింపులాగి ఒందు ల‌వ్‌స్టోరీ` ని తెలుగులో రీమేక్ చేశాడు. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంత మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…
క‌థ‌:
 అభిరాం(త‌రుణ్‌) ఓ యాడ్ కంపెనీలో క్రియేటివ్ హెడ్‌గా ప‌నిచేస్తుంటాడు. త‌న చెల్లెల‌కు కాబోయే భ‌ర్త అమ‌ర్‌ని క‌ల‌వ‌డానికి అర‌కు వెళ‌తాడు. అలాగే అమ‌ర్ చెల్లెలు డా.శృతిని కూడా క‌లిసి పెళ్లి చేసుకోవాలనుంటాడు. అర‌కు చేరుకున్న అభిరాంకి డా.శృతి అని ఓ అమ్మాయి పరిచ‌యం అవుతుంది. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో.. ఇద్ద‌రూ మ‌న‌సు విప్పి మాట్లాడుకుంటారు. ఆ క్ర‌మంలో ఇద్ద‌రూ త‌మ గ‌త ప్రేమ‌ల‌ను ఒక‌రికొక‌రు చెప్పుకుంటారు. ఓ సంద‌ర్భంలో త‌న‌తో మాట్లాడుతున్న అమ్మాయి.. డా.శృతి కాద‌నే నిజం అభిరాంకు తెలుస్తుంది. అభిరాంకి అస‌లు నిజం తెలిసిపోవ‌డంతో అమ్మాయి నిజం చెప్పేస్తుంది. అమ్మాయి పేరు అభిన‌య(ఓవియా) అని.. త‌ను శృతిని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన పెషంట్ అని కూడా చెబుతుంది. అయితే అభిన‌య‌తో అభిరాం ప్రేమ‌లో ప‌డ‌తాడు. అభిన‌య కూడా అభిరాంను ప్రేమిస్తుంది. మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే, అభిరాం ఎవ‌ర‌తో తెలియ‌ద‌ని.. త‌న ఇంట్లోకి వ‌చ్చాడ‌ని చెప్పి పోలీసుల‌కు చెప్పి అరెస్ట్ చేయిస్తుంది. ప్రేమించిన అభిన‌యం అలా చేయ‌డంతో అభిరాం షాక‌వుతాడు. అస‌లు అభిన‌య ఎందుక‌లా ప్ర‌వ‌ర్తిస్తుంది?  చివ‌ర‌కు ఇద్ద‌రూ క‌లుసుకుంటారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్ల‌స్ పాయింట్స్‌:
– ఇంటర్వెల్‌, ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్స్‌
– హీరో త‌రుణ్, హీరోయిన్ ఓవియా
– నిర్మాణ విలువ‌లు
 మైన‌స్ పాయింట్స్‌:
– ద‌ర్శ‌క‌త్వం
– నేప‌థ్య సంగీతం
– సంభాష‌ణ‌లు
– సన్నివేశాలు సాగ‌దీత‌గా అనిపించ‌డం
విశ్లేష‌ణ‌:
మూడు కోణాల్లో సినిమాలో ల‌వ్‌స్టోరీ ర‌న్ అవుతుంది. ఒక‌టి త‌రుణ్ కోణంలో.. మ‌రొక‌టి హీరోయిన్ ఓవియా కోణం.. మూడ‌వ‌ది తెర‌పై న‌డిచే క‌థ‌. మూడు క‌థ‌ల్లోనూ త‌రుణ్‌, ఓవియానే క‌లిసి న‌టించారు. నాలుగైదు పాత్ర‌లు.. అది కూడా రెండు మూడు సీన్స్ మిన‌హా సినిమా ఆసాంతం త‌రుణ్‌, ఓవియాల‌పైనే సినిమా న‌డుస్తుంది. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని.. ముఖ్యంగా ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించేట‌ప్పుడు ఫీల్‌, ఎమోష‌న్స్‌ను మిస్ చేయ‌కూడ‌ద‌నే చిన్న లాజిక్‌ను మ‌రిచ‌పోయారు ద‌ర్శ‌కులు ర‌మేష్‌గోపీ. సినిమాను త‌మ సంభాష‌ణ‌ల‌తో .. త్రివిక్ర‌మ్‌తో పోటీ పడుతూ విజ‌యం వైపు తీసుకెళ్లిపోతామ‌నే ధీమా సినిమాలో క‌న‌ప‌డింది. ఎందుకంటే సినిమాలో ఫీల్‌, ఎమోష‌న్స్ కంటే పేజీల కొద్ది డైలాగులుండ‌ట‌మే. కుక్క థియ‌రీపై డైలాగులు, క్రెడిట్ కార్డు క్రెడిట్ ఉంటుంది. క్రీమ్ బిస్కట్ లో క్రీమ్ ఉంటుంది.. మార్క్ లిస్టులో మార్కులే లేవు అనే … త‌ర‌హా డైలాగులు సినిమాలో ఎక్కువైపోయాయి. ఇలాంటి డైలాగ్స్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్తేం కాదు. కాబట్టి ప్రేక్ష‌కుల‌కు సినిమా చూస్తున్నంత సేపు న‌వ్వురాదు. హీరో త‌రుణ్‌, హీరోయిన్ ఓవియాలు మిన‌హా సినిమాలో కొత్త‌గా ఏమీ క‌న‌ప‌డ‌దు. ముఖ్యంగా హీరోత‌రుణ్ మూడు లుక్స్‌లో మెప్పించాడు. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. హీరో హీరోయిన్ జంట బావున్నా.. ద‌ర్శ‌కులిద్ద‌రూ వారి మ‌ధ్య కెమిస్ట్రీని చ‌క్క‌గా తెర‌పై చూపించ‌డంలోవిఫ‌ల‌మ‌య్యారు. డిఫ‌రెంట్ లేయ‌ర్స్ ఉన్న సినిమాను న‌డిపించ‌డం అంత సులువు కాద‌నే విష‌యంలో ద‌ర్శ‌కుల అనుభ‌వలేమీ తెర‌పై క‌న‌ప‌డుతుంది. క్రిస్టోఫ‌ర్ జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. శ్రీనాథ్ విజ‌య్ ట్యూన్స్‌లో రెండు సాంగ్స్ బావున్నాయి. నేప‌థ్య సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
బోట‌మ్ లైన్‌: ఆక‌ట్టుకోలేక‌పోయిన `ఇది నా ల‌వ్‌స్టోరీ`
రేటింగ్‌: 2.25/5

Movie title:- Idi Naa Love Story

Banner:-  Ram Entertainers

Release date:-14.02.2018

Censor Rating:-“U/A”

Cast:- Tarun, Oviya

Story:-Suni

Screenplay:- Ramesh Gopi

Dialogues:- Veerababu

Directed by:-Ramesh Gopi

Music:- Srinath Vijay

Lyricist:-Ramajogayya Sastry

Cinematography:-Christopher Joseph

Editing:- . Singampalli Siva Shankar

Producer:- S V Prakash

Run Time:-132 minutes