ఇద్ద‌రూ జ‌ర్న‌లిస్టులేన‌ట‌

Published On: December 20, 2017   |   Posted By:

ఇద్ద‌రూ జ‌ర్న‌లిస్టులేన‌ట‌

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం `మ‌హాన‌టి`. సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టిస్తుంది. ఈ సినిమాకు నాగ అశ్విన్ ద‌ర్శ‌కుడు. న‌డిగ‌ర్ తిల‌గం పేరుతో సినిమా త‌మిళంలో విడుద‌ల‌వుతుంది.  కీల‌క పాత్ర‌ల్లో మోహ‌న్‌బాబు, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత‌, షాలినీ పాండే న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎస్వీఆర్‌గా మోహ‌న్‌బాబు, జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్‌, జ‌మున‌గా షాలిని న‌టిస్తున్నారు. విజ‌య్‌, స‌మంత పాత్ర‌ల‌పై పెద్ద క్లారిటీ రాలేదు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో.. విజ‌య్ అస‌లు చెప్పేశాడు.. తాను ఎన్టీఆర్ పాత్ర‌లోనో ఎంజీఆర్ పాత్ర‌లోనో న‌టిస్తున్నానంటూ వ‌స్తున్న వార్త‌లు నిజం కావ‌ని.. ఇందులో తాను, స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నామ‌ని చెప్పుకొచ్చాడు విజ‌య్‌.