ఈనెల 26న రామ్ చరణ్, బోయపాటి సినిమా లాంఛ్

Published On: November 22, 2017   |   Posted By:
ఈనెల 26న రామ్ చరణ్, బోయపాటి సినిమా లాంఛ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 26న ఈ సినిమా లాంఛింగ్ ఉంటుంది. ప్రస్తుతం మెగా కాంపౌండ్ నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం… రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ సినిమానే టేకప్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రంగస్థలం అనేది పూర్తిగా కాన్సెప్ట్ మూవీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ప్రత్యేకమైన కథతో కూడి ఉంది. దీనికంటే ముందొచ్చిన ధృవ సినిమా కూడా కంప్లీట్ క్లాస్ మూవీ. ఇలాంటి 2 సినిమాల తర్వాత పక్కా మాస్ మూవీ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో బోయపాటికి ఛాన్స్ ఇచ్చాడట చెర్రీ.
నిజానికి బోయపాటి కంటే ముందే కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయాలి. కానీ కొరటాలతో సినిమా అంటే మళ్లీ క్లాస్ సెగ్మెంట్ కిందకు వెళ్లిపోతుంది. అందుకే అంతకంటే ముందు బోయపాటితో కాంబినేషన్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి.