ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published On: April 17, 2018   |   Posted By:
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
టాలీవుడ్ లో ఈరోజు పలువురు ప్రముఖులు తమ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్లలో ఒకరు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఊహించని అతి తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, నిర్మాతకు 200 శాతం లాభాలు తెచ్చిపెట్టే దర్శకుడిగా ఇంద్రగంటికి మంచి పేరుంది. అష్టాచమ్మాతో దర్శకుడిగా మారిన ఇంద్రగంటి, తాజాగా అమీతుమీతో మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం అనే మరో రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తీస్తున్నారు
 
మరోవైపు సిద్దార్థ్, విక్రమ్ కూడా ఈరోజు తమ పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీళ్లిద్దరికీ తెలుగు, తమిళ భాషల్లో అభిమానులున్నారు. ఇద్దరూ విలక్షణ చిత్రాలతో పాపులర్ అయ్యారు. రీసెంట్ గా గృహం సినిమాతో సిద్దార్థ్ సక్సెస్ కొడితే… సామి సీక్వెల్ తో హిట్ కోసం దూసుకొస్తున్నాడు విక్రమ్.
 
 
సిద్దార్థ్, విక్రమ్, ఇంద్రగంటికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.