ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published On: August 12, 2017   |   Posted By:
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఇద్దరు సినీ ప్రముఖులు ఈరోజు(12-08-2017) తమ పుట్టినరోజుల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్లలో ఒకరు సాయేషా సైగల్. అక్కినేని చిచ్చరపిడుగు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే సాయేషా కూడా హీరోయిన్ గా పరిచయమైంది. తన లుక్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఆ మూవీ తర్వాత మరో తెలుగు సినిమాకు కమిట్ అవ్వని ఈ భామ.. ఎప్పటికప్పుడు క్యూట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తూనే ఉంది. రీసెంట్ గా జయంరవితో కలిసి ఓ తమిళ సినిమా చేసిన ఈ భామ, ప్రస్తుతం కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంటోంది. మంచి స్క్రిప్ట్ దొరికితే తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇస్తానంటోంది.
ఇక సాయేషాతో పాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో సినీప్రముఖుడు గిబ్రాన్. టెలివిజన్ జింగిల్స్ తో పాపులరై సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన ఈ సంగీత దర్శకుడు సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు. మొదటి సినిమాకే అవార్డు విన్నింగ్ మ్యూజిక్ అందించిన గిబ్రాన్.. కమల్ హాసన్ హీరోగా నటించిన ఉత్తమ విలన్ సినిమాకు లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు. ఈ ఒక్క సినిమానే గిబ్రాన్ కు దాదాపు 10 అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరో 12 తమిళ సినిమాలకు సంగీతం అందిస్తూ మోస్ట్ బిజీయస్ట్ కంపోజర్ గా కొనసాగుతున్నాడు.
ఈరోజు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న సాయేషా, గిబ్రాన్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్