ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published On: September 26, 2017   |   Posted By:

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

టాలీవుడ్ లో ఈరోజు (26-09-17) చందు మొండేటి, అజయ్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ప్రేమమ్ సినిమాతో చందుమొండేటి టాలీవుడ్ లో తన క్రేజ్ ను ఇంకాస్త పెంచుకోగా.. ఎన్నో విలక్షణమైన పాత్రలతో పరిశ్రమలో ఇప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు అజయ్.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వురులో జన్మించిన చందుమొండేటి.. కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. తర్వాత కార్తికేయ లాంటి అద్భుతమైన స్క్రిప్ట్ తో హీరో నిఖిల్ ను ఒప్పించాడు. అలా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు.. తన రెండో ప్రయత్నంగా నాగచైతన్యతో ప్రేమమ్ సినిమా చేశాడు. అది కూడా హిట్ అయింది. ప్రస్తుతం నాగచైతన్యతోనే సవ్యసాచి అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ మూవీతో పాటు నిఖిల్ హీరోగా నటిస్తున్న మరో సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నాడు చందు మొండేటి

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో సెలబ్రిటీ అజయ్. 2000 సంవత్సరం నుంచి సినిమాల్లో నటిస్తున్న ఈ నటుడు.. ఒక్కడు, సై, అతడు, పోకిరి సినిమాలతో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ ఒకెత్తయితే.. విక్రమార్కుడు సినిమాలో అజయ్ పోషించిన టిట్లా క్యారెక్టర్ మరో ఎత్తు. ఈ సినిమాతోనే నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు అజయ్. ఏడాదికి కనీసం 10 సినిమాలకు తగ్గకుండా చేసే అజయ్.. టాలీవుడ్  లో ఆల్ రౌండర్ గా ఎదిగాడు. ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకున్నాడు.

ఈరోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న చందు మొండేటి, అజయ్ కు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.