ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published On: October 9, 2017   |   Posted By:
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. ఆ యాంగిల్ లో వాళ్లకు తిరుగుండదు. సెన్సిబుల్ సినిమాలు తీయడంలో శేఖర్ కమ్ముల దిట్ట. భారీ చిత్రాలు తీయడంలో శంకర్ దిట్ట. అలాగే మాస్ సినిమాలు తీయడంలో వి.వి.వినాయక్ దిట్ట. మొదటి సినిమా నుంచే తన మార్క్ చూపించి మాస్ కు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్నారు దర్శకుడు వీవీ వినాయక్. ఈరోజు (09-10-17) ఈ మాస్ దర్శకుడు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఆది సినిమాతో వినాయక్ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ సినిమా ఎన్టీఆర్ కు మాస్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు వినాయక్ ను స్టార్ డైరక్టర్ గా మార్చేసింది. వినాయక్ కు ఇదే మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరు. అంతలా ఎక్కడా తడబడకుండా ఆ సినిమాను తెరకెక్కెంచాడు వినాయక్. ఆది సినిమా నుంచి మొన్నటివ ఖైదీ నంబర్ 150 వరకు కెరీర్ లో ఎక్కడా వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం రాలేదు ఈ దర్శకుడికి.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖుల్లో ఎస్పీ శైలజ కూడా ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 5వేలకు పైగా పాటలు పాడి సౌత్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం పాటలు పాడ్డమే కాకుండా టబు, శ్రీదేవి, సోనాలి బింద్రే లాంటి హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పి శభాష్ అనిపించుకున్నారు. విశ్వనాథ్ తెరకెక్కించిన సాగర సంగమంలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు.  నటుడు శుభలేఖ సుధాకర్ ను పెళ్లి చేసుకున్న శైలజ.. తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వినాయక్, ఎస్పీ శైలజకు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.