ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published On: October 26, 2017   |   Posted By:
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
టాలీవుడ్ లో ఈరోజు (26-10-2017) ఇద్దరు ప్రముఖులు తమ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. వీళ్లలో ఒకరు దర్శకుడు సుజీత్. రన్ రాజా రన్ సినిమాతో ఫేమ్ లోకి వచ్చిన ఈ దర్శకుడు, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సాహో అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ ఒక్క సినిమాతో సుజీత్ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. దీనికి కారణం బాహుబలి-2 లాంటి భారీ విజయం తర్వాత ప్రబాస్, సుజీత్ కు ఛాన్స్ ఇవ్వడమే. ప్రస్తుతం ఈ సినిమా మేకింగ్ లో సుజీత్ బిజీగా ఉన్నాడు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో సెలబ్రిటీ అసిన్. మొన్ననే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అసిన్.. కూతురు పుట్టిన ఆనందంలో ఈరోజు తన బర్త్ డే ను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. పలుపురు టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు డబుల్ కంగ్రాట్స్ చెబుతున్నారు. తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, రవితేజ, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది అసిన్.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అసిన్, సుజీత్ కు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.