ఈరోజు ప్రముఖులు వీళ్లే…

Published On: July 18, 2017   |   Posted By:

ఈరోజు ప్రముఖులు వీళ్లే…

ప్రతి రోజు క్యాలెండర్ లో డేట్ మారుతుంది. కానీ ఆ తేదీకి ఓ ప్రత్యేకత కచ్చితంగా ఉంటుంది. సినిమా విషయానికొస్తే ఆ స్పెషాలిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈరోజు (జులై 18)కు కూడా ఓ ప్రత్యేకత ఉంది. పలువురు ప్రముఖులు ఈ రోజు తమ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

సౌత్ లో పాపులర్ నటి సౌందర్య. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే సౌందర్య జయంతి ఈరోజు. కన్నుమూసి ఇన్నేళ్లయినా ఆమెను గుర్తుచేసుకుంటున్నామంటే దానికి కారణం సౌందర్య పోషించిన పాత్రలే. అమ్మగా, ప్రేయసిగా, రాక్షసిగా, అమ్మోరుగా, లేడీ విలన్ గా.. ఇలా ఎన్నో పాత్రల్లో మెప్పించింది సౌందర్య

తెలుగుతెరను సుసంపన్నం చేసిన మహానటుడు ఎస్వీఆర్ వర్థంతి ఈరోజు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ది బెస్ట్ మెథడ్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్నారు ఎస్వీ రంగారావు. విశ్వనట చక్రవర్తి అనే బిరుదు ఈయన కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. 56 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఎస్వీఆర్, కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. దుర్యోధనుడు, భీష్ముడు, ఘటోత్కచుడు, యముడు, రావణుడు, కీచకుడు, దక్షుడు, హరిశ్చంద్ర.. ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలు ఎస్వీఆర్ ద్వారా ప్రాణం పోసుకున్నాయి.

ఇక ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బ్యూటీ క్వీన్ ప్రియాంక చోప్రా. ఇండియన్ టాలెంట్ ను విశ్వవ్యాప్తం చేసిన నటిగా పేరుతెచ్చుకుంది ప్రియాంక చోప్రా. భారతీయ హీరోయిన్లు హాలీవుడ్ లో రాణించలేరు, మెప్పించలేరని భ్రమల్ని పటాపంచలు చేసింది. కేవలం నటిగానే కాకుండా పాప్ సింగర్ గా, సోషలైట్ గా హాలీవుడ్ లో మెరుపులు మెప్పిస్తోంది ప్రియాంక.