ఈరోజు బర్త్ డే బ్యూటీ సునిథి చౌహాన్

Published On: August 14, 2017   |   Posted By:

ఈరోజు బర్త్ డే బ్యూటీ సునిథి చౌహాన్

అందమైన రూపం మాత్రమే కాదు, ఆకట్టుకునే గాత్రం కూడా ఆమె సొంతం. ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా పాడుతుంది కూడా. ఆ అందం పేరు సునిథి చౌహాన్.10 భాషల్లో వందలాది పాటలు పాడిన ఈ సింగర్ ఈరోజు (14-08-2017) తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నారు.

ఢిల్లీలో పుట్టిపెరిగిన సునిథి.. 13 ఏళ్లకే గాయనిగా మారింది. అతి చిన్న వయసులోనే ‘మేరీ ఆవాజ్ సునో’ అనే సింగింగ్ పోటీలో టైటిల్ నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెరీర్ లో ఎన్నో మెలొడీలు, మరెన్నో యుగళగీతాలు ఆలపించిన సునిథి.. ఐటెంసాంగ్స్ తో మాత్రం పిచ్చ పాపులారిటీ సంపాదించింది. 6 ఏళ్ల కిందటివరకు సూపర్ హిట్ అయిన ప్రతి ఐటెం సాంగ్ సునిథి పాడిందే.

ఇక టాలీవుడ్ విషయానికొస్తే తెలుగులో ఆమె పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అయింది. ఓయ్, బద్రినాథ్, కేడీ, కంత్రి, మస్కా, విక్టరీ, కెవ్వు కేక.. ఇలా లెక్కలేనన్ని సినిమాల్లో పాటలు పాడారు సునిథి. తన కెరీర్ లో సునిథి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.