ఈసారి కూడా స్టార్ హీరోనే

Published On: August 29, 2017   |   Posted By:

ఈసారి కూడా స్టార్ హీరోనే

ర‌వితేజ ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిమారిన కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) త‌ర్వాత ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమా చేశాడు.

ప‌వ‌ర్‌తో మంచి స‌క్సెస్ అందుకున్న బాబీకి స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ నిరాశ‌నే మిగిల్సింది.

అయితే ఫెయిల్యూర్‌కు భిన్నంగా మూడో సినిమాకు ఎన్టీఆర్‌తో అవ‌కాశం అందిపుచ్చు కున్నాడు.  జైల‌వ‌కుశ సినిమాలో ఎన్టీఆర్ ఏకంగా త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

జై ల‌వ‌కుశ విడుద‌ల‌కు ముందే బ‌న్ని స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ను లైన్‌లో పెట్ట‌డానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా బ‌న్నిని క‌లిసిన బాబి ఓ లైన్ చెప్పాడ‌ట‌. బ‌న్ని కూడా పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయ‌మ‌ని అన్నాడ‌ట‌. స్క్రిప్ట్ న‌చ్చితే బ‌న్ని, బాబీ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కనుండ‌టం తెలుస్తుంది.