ఈసారైనా హిట్ త‌గులుతుందా…?

Published On: August 7, 2017   |   Posted By:
ఈసారైనా హిట్ త‌గులుతుందా…?
సినిమా ఇండ‌స్ట్రీలో న‌ట‌న‌, అందంతో పాటు అదృష్టం కూడా ఎంతో అవ‌స‌రం. ఎంతో హార్డ్‌వ‌ర్క్ చేసినా కూసింత ల‌క్ లేక‌పోతే, స‌క్సెస్ ద‌రిచేరదు. ముఖ్యంగా హీరోయిన్స్ విష‌యంలో ల‌క్ ఫ్యాక్ట‌ర్ చాలా అవ‌స‌రం. ఇది లేకుండా చాలా మంది హీరోయిన్స్ తెరమ‌రుగైపోయారు. అందుకే తాము చేసే సినిమాలు క‌లిసి రావాల‌ని హీరోయిన్స్ కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకుంటున్న హీరోయిన్స్‌లో ప‌గ్ర్యా జైశ్వాల్ చేరింది.
అందం ఉంది.. అభిన‌యం ఉంది.. ప్ర‌గ్యా న‌టించిన చిత్రాలు డేగ‌, మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం న‌మో వెంక‌టేశాయ‌, గుంటూరోడు..తాజాగా న‌క్ష‌త్రంల‌లో కంచె ఆమెకు మంచి గుర్తింపు తీసుకువ‌చ్చిందంతే. అయితే క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా ప్ర‌గ్యాకు పేరు రాలేదు.  దీంతో ప్ర‌గ్యా ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నింటినీ జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రంపైనే పెట్టుకుంది. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరున్న బోయ‌పాటి ఎలాగైనా త‌న‌కు ఓ హిట్ ఇస్తాడ‌ని ఈ అమ్మ‌డు భావిస్తోంది. గ‌త‌వారం ప్ర‌గ్యా న‌టించిన  న‌క్ష‌త్రంతో అందాల విందు చేసి మ‌రీ నిరాశ‌ప‌డిన ప్ర‌గ్యాకి.. జ‌య‌జానికి నాయ‌క సినిమాతో హిట్ రావాల‌ని కోరుకుందాం..