ఈ భామ‌కి హిట్ ద‌క్కేనా?

Published On: August 28, 2017   |   Posted By:

ఈ భామ‌కి హిట్ ద‌క్కేనా?

ఐదేళ్ల కెరీర్‌.. ఐదు సినిమాలు.. మూడు భాష‌లు.. ఇదీ అందాల భామ పూజా హెగ్డే గురించి సింపుల్‌గా చెప్ప‌మంటే ఎవ‌రైనా చెప్ప‌గ‌లిగేది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది.. కానీ న‌ట‌న శూన్యం. ఇక‌ విజ‌యాల సంఖ్య కూడా న‌ట‌న విష‌యంలో ఉన్న‌దే.  జీవా, నాగ‌చైత‌న్య‌, వ‌రుణ్ తేజ్‌, హృతిక్ రోష‌న్‌, అల్లు అర్జున్‌.. ఇలా ఏ హీరో కూడా ఆమెకి క‌లిసి రాలేదు.
అలాంటి పూజా చేతిలో ప్ర‌స్తుతం ఒకే ఒక అవ‌కాశం ఉంది. అదే బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా. అయితే డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ కైనా చెప్పుకోద‌గ్గ విజ‌యాలున్నాయి కానీ.. హీరో శ్రీ‌నివాస్ కి మాత్రం సాలిడ్ హిట్ లేనే లేదు.  ఈ నేప‌థ్యంలో పూజాకి కొత్త చిత్రం విజ‌యం చాలా కీల‌కంగా మారింది. ఈ సారైనా హిట్ కొడితే స‌రి.. లేదంటే.. ఫ్లాప్ ల విష‌యంలో డ‌బుల్ హ్యాట్రిక్ ని చాలా స‌క్సెస్‌ఫుల్‌గా త‌న వ‌శం చేసుకున్న‌ట్లవుతుంది పూజాకి.