ఈ వీకెండ్ కూడా భారీ పోటీ

Published On: November 22, 2017   |   Posted By:

ఈ వీకెండ్ కూడా భారీ పోటీ

టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఈ వీకెండ్ కూడా భారీ పోటీ నెలకొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. నారా రోహిత్, శ్రీవిష్ణు సినిమాలతో పాటు మరెన్నో మూవీస్ ఈ శుక్రవారం వచ్చేందుకు పోటీపడుతున్నాయి. అయితే వీటిలో ఎన్ని శుక్రవారానికి కన్ ఫర్మ్ అవుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెరవెనక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో పలు సినిమాలు నడుస్తున్న నేపథ్యంలో.. వీటిలోంచి కొన్నింటిని పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చేందుకు ట్రై చేస్తున్న సినిమాల లిస్ట్ చూద్దాం
1. బాలకృష్ణుడు
నటీనటులు – నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ
దర్శకుడు – పవన్ మల్లెల
సంగీత దర్శకుడు – మణిశర్మ
నిర్మాత – బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ
బ్యానర్ – స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్
2. మెంటల్ మదిలో
నటీనటులు – శ్రీ విష్ణు, నివెత పెతురాజ్
దర్శకుడు – వివెక్ ఆత్రెయ
సంగీత దర్శకుడు – ప్రషాంత్ విహారి
నిర్మాత – రాజ్ కందుకూరి
3. నెపోలియన్
నటీనటులు – ఆనంద్‌ రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి
దర్శకుడు – ఆనంద్‌ రవి
సంగీత దర్శకుడు – సిద్ధార్థ్‌ సదాశివుని
నిర్మాత – భోగేంద్ర గుప్తా మడుపల్లి
4. హే పిల్లగాడా
నటీనటులు – దుల్కర్ సల్మాన్, సాయిపల్లవి
దర్శకుడు – స‌మీర్ తాహిర్‌
సంగీత దర్శకుడు – గోపీసుంద‌ర్‌
నిర్మాత – డి.వి.కృష్ణ‌స్వామి
5. దేవిశ్రీప్రసాద్
నటీనటులు – పూజా రామచంద్రన్, భూపాన్, ధన్ రాజ్, మనోజ్ నందం
దర్శకుడు – శ్రీ కిషోర్
సంగీత దర్శకుడు – కమ్రాన్
నిర్మాత – డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్
6. బేబి
నటీనటులు – శతణ్య, శివార్షిణి, షిరా, మనోజ్ కె.భారతి
దర్శకుడు – డి.సురేష్
సంగీత దర్శకుడు – సతీష్, హరీష్
నిర్మాత – డి.శంతిల్, కె.యోగేష్
బ్యానర్ – సాయిప్రసన్న పిక్చర్స్
7. లచ్చి
నటీనటులు – జయతి, తేజశ్విని, దిలీప్
దర్శకుడు – ఈశ్వర్
సంగీత దర్శకుడు – సురేష్ యువ‌న్‌, పాల్ పవన్
నిర్మాత – జయతి
బ్యానర్ – J9 4షోస్ బ్యాన‌ర్
8. జంధ్యాల రాసిన ప్రేమకథ
నటీనటులు – శేఖర్, దిలీప్, శ్రీలక్ష్మి, గాయత్రి
దర్శకుడు – కృష్ణవర్మ
సంగీత దర్శకుడు – గోపి
నిర్మాత – కార్తీక్ రెడ్డి, అశోక్ సిరియాల
బ్యానర్ – కీర్తి క్రియేషన్స్
9. జూన్ 143
నటీనటులు – ఆదిత్య, రిచా
దర్శకుడు – భాస్కర్ బంటుపల్లి
సంగీత దర్శకుడు – శ్రవణ్
నిర్మాత – లక్ష్మి
బ్యానర్ – ఆదిత్య క్రియేషన్స్
10. ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు
నటీనటులు – ప్రశాంత్, మధు, లలిత, ఇషితా
దర్శకుడు – వెంకటేష్ కె.
సంగీత దర్శకుడు – రమేష్ డి
నిర్మాత – ప్రశాంత్
బ్యానర్ – లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్