ఉగాది నుంచి నాని-నాగ్ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్

Published On: March 13, 2018   |   Posted By:

ఉగాది నుంచి నాని-నాగ్ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్

మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలసిందే. సంగీత దర్శకుడు మణిశర్మ సాంగ్ రికార్డింగ్ తో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఇప్పుడీ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించి డేట్ ఫిక్స్ అయింది. మార్చి 18 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకుడు.

నిన్నటితో ఆఫీసర్ సినిమా షూటింగ్ పూర్తిచేశాడు నాగార్జున. అటు నాని కూడా 2 వారాల కిందటే కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ పూర్తిచేశాడు. సో.. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఫ్రీగానే ఉన్నారు. దీంతో మల్టీస్టారర్ కు కాల్షీట్లు కేటాయించారు. అలా మూవీ సెట్స్ పైకి రాబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది.

ప్రస్తుతం ఈ సినిమా పాటల రికార్డింగ్ అమెరికాలో జరుగుతోంది. సినిమాకు సంబంధించి 3 పాటల రికార్డింగ్ అక్కడ జరుగుతోంది. మూవీకి సంబంధించి ఇంకా హీరోయిన్ల వివరాలు వెల్లడించలేదు.