ఉత్తరాంధ్రలో బాలయ్య సరికొత్త రికార్డు

Published On: January 20, 2018   |   Posted By:
ఉత్తరాంధ్రలో బాలయ్య సరికొత్త రికార్డు
జై సింహా సినిమాతో ఉత్తరాంధ్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు బాలయ్య. వరుసపెట్టి 5 సినిమాలతో 3 కోట్ల రూపాయల షేర్ అందుకున్న హీరోగా నిలిచాడు. ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో ఏ హీరోకు దక్కని రికార్డు ఇది. పవన్, రామ్ చరణ్, మహేష్ సినిమాలు కూడా ఉత్తరాంధ్రలో హిట్ అవుతాయి. కానీ బాలయ్యలా ఇలా వరుసగా 5 సినిమాలతో 3 కోట్ల షేర్ అందుకున్న చరిత్ర లేదు.
ఉత్తరాంధ్రలో బాలయ్య షేర్లు
సింహా – రూ. 3.4 కోట్లు
లెజెండ్ – రూ. 3.6 కోట్లు
డిక్టేటర్ – రూ. 3.15 కోట్లు
గౌతమీపుత్ర శాతకర్ణి – రూ. 5.4కోట్లు
జై సింహా – రూ. 3.09 కోట్లు (ఇంకా నడుస్తోంది)