ఉత్తరాంధ్ర టాప్-10 ఫస్ట్ డే వసూళ్లు

Published On: April 21, 2018   |   Posted By:
ఉత్తరాంధ్ర టాప్-10 ఫస్ట్ డే వసూళ్లు
సినిమా విజయంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర వాటా కూడా కీలకంగా మారింది. నైజాం, సీడెడ్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టే ప్రాంతం ఉత్తరాంధ్ర మాత్రమే. 3 జిల్లాలు కలిసి ఉండడం, సినీ అభిమానులు, థియేటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం టాలీవుడ్ కు కీలకంగా మారింది. అందుకే దిల్ రాజు, సురేష్ బాబు లాంటి నిర్మాతలు ఇప్పటికే ఉత్తరాంధ్రలో చాలా థియేటర్లను లీజుకు తీసుకున్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతలైతే ఏకంగా థియేటర్లను కొనుగోలు చేశారు కూడా.
సరే.. ఈ విషయం పక్కనపెడితే.. మొదటి రోజు వసూళ్లలో ఉత్తారాంధ్రలో అత్యథిక వసూళ్లు (షేర్) సాధించిన సినిమాలేంటో చూద్దాం. భరత్ అనే నేను రాకతో ఈ లిస్ట్ లో స్థానాలు మారాయి.
ఉత్తరాంధ్ర టాప్-10 షేర్లు
1. బాహుబలి-2 – రూ. 4.52 కోట్లు
2. అజ్ఞాతవాసి – రూ. 3.74 కోట్లు
3. కాటమరాయుడు – రూ. 3.01 కోట్లు
4. భరత్ అనే నేను – రూ. 2.91 కోట్లు
5. ఖైదీ నంబర్ 150 – రూ. 2.49 కోట్లు
6. రంగస్థలం – రూ. 2.43 కోట్లు
7. జనతా గ్యారేజ్ – రూ. 2.30 కోట్లు
8. సర్దార్ గబ్బర్ సింగ్ – రూ. 2.01 కోట్లు
9. దువ్వాడ జగన్నాధమ్ – రూ. 1.94 కోట్లు
10. జై లవకుశ – రూ. 1.89 కోట్లు