ఉదయం మహానుభావుడు.. సాయంత్రం జై లవకుశ

Published On: August 23, 2017   |   Posted By:

ఉదయం మహానుభావుడు.. సాయంత్రం జై లవకుశ

రేపంతా టాలీవుడ్ లో ఫుల్ హంగామా నడవబోతోంది. ఉదయం మహానుభావుడు, సాయంత్రం జై లవకుశ సినిమలు హంగామా చేయబోతున్నాయి. రేపు ఉదయం సరిగ్గా 9గంటల 30 నిమిషాలకు మహానుభావుడు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్. రేపు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు షార్ట్ టీజర్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు.

ఇక సాయంత్రం సరిగ్గా 5 గంటల 40నిమిషాలకు జై లవకుశ టీజర్ రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జై టీజర్ రిలీజైంది. రేపు లవకుమార్ టీజర్ వస్తోంది. పేరుకు తగ్గట్టే లవర్ బాయ్ లుక్ లో ఎన్టీఆర్ కనువిందు చేసే టీజర్ అది. ఇలా ఈ రెండు సినిమాలు రేపు సందడి చేయబోతున్నాయి.

ఇదే సందడి సేమ్-టు- సేమ్ దసరాకు కూడా రిపీట్ కానుంది. సెప్టెంబర్ 21న జై లవకుశ రిలీజ్ అవుతుంటే.. 8 రోజుల గ్యాప్ లో 29వ తేదీన మహానుభావుడు సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.