ఉదయ్ కిరణ్ స్మారక అవార్డ్ లు 2018

Published On: June 27, 2018   |   Posted By:

ఉదయ్ కిరణ్ స్మారక అవార్డ్ లు 2018

ప్రముఖ హీరో స్వర్గీయ ఉదయ్ కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరబాద్ లోని ప్రసాద్ లాబ్స్ నందు ఆయన అక్క గారు శ్రీమతి శ్రీదేవి,అభిమానులు వీరేశ్ మరియు మిత్రులందరూ కలిసి షార్ట్ ఫిల్మ్ అవార్డ్ ల కార్యక్రమంతో పాటు ,ఉదయ్ కిరణ్  పుట్టిన రోజు వేడుకలు  అత్యంతవైభవంగా జరిగాయి.

ఈ కార్య క్రమానికి శ్రీ వేణు గోపాల చారి గారు ( తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి,ఢిల్లీ ),నిర్మాత ,దర్శకులు సాయి వెంకట్,సంగీత దర్శకులు ఆర్.పిపట్నాయక్,దర్శకులు వి.యన్.ఆదిత్య, దర్శకులు యన్.శంకర్ ,హాస్య నటులు హరీష్, మరియు మరెందరో సినీ రాజకీయ ప్రతినిధులు,అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఉదయ్ కిరణ్ తన ప్రతి పుట్టిన రోజుకు ఎంతో ఇష్టపడే బర్త్ డే కేక్ ను వీరేశ్ మరియు ఆయన అభిమానులు కట్ చేసిఆహ్వితులందరితో పంచుకోవడం విశేషం.

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన 9 సంవత్స రాల  గిరిజన బాలిక  కథ ఆధారంగ యన్ యస్ నాయక్ నిర్మించిన చిరు తేజ్ సింగ్ చిత్రానికి గాను,ఉత్తమలఘు చిత్ర దర్శకులుగా డాక్టర్ ఆనంద్ మరియు అశోక్ రెడ్డి (మిస్టర్ అంద్ మిసెస్ ) ,ఉత్తమ చిత్రంగా మంగమ్మ గారి మనవడు మరియుసమాప్తం,ఉత్తమ నిటిగా ప్రియ, ఉత్తమ నటుడిగా కళా రంగం మరియు తరుణం నటులు,ఉత్తమ బాల నటిగా చిరు తేజ్ సింగ్,ఉత్తమ సహాయనటిగా సౌమ్య వేణు గోపాల్,ప్రత్యేక జ్యూరీ అవార్డ్ ను ఆర్ పి పట్నాయక్ (తథాస్తు) ,మరెందరో వివిధ కేట గిరీలలో అవార్డ్ లను అందుకున్నారు.

శ్రీ వేణు గోపాల చారి మాట్లాడుతూ, ఉదయ్ మన మధ్య లేకున్నా అయన అభిమానులు,మిత్రులు ఇలా ఆయనకు నివాళి అందించడం అద్భుతమన్నారు. వచ్చే సంవత్సరం తెలంగాణా ప్రభుత్వం తరుపునుంచి కూడా తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తామని వేణు గోపాలా చారి మరియునిర్మాత సాయి వెంకట్ మరియు ఎందరో ముందుకు రావడం అందరిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా ఉదయ్ అక్క గారు శ్రీమతి శ్రీదేవి పంపిన సందేశం మరియు ఉదయ్ వీడియో క్లిప్పింగ్స్ అందరినీ కన్నీటి పర్యంతానికి గురిచేసాయి.

దర్శకులు వి యన్ ఆదిత్య, ఆర్ పి పట్నాయక్ ,ఉదయ్ తో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.​

ఈ సందర్భంగా అమ్ములు ప్రదర్శించిన నాట్య ప్రదర్శణ ,నాగి రెడ్డి మిమిక్రి ,ఆర్ జె విజె వేణు వ్యాఖ్యానం మరియు ఇతర సాంస్క్రుతిక కార్యక్రమాలను చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు .

ఈ కార్య క్రమ ముఖ్య నిర్వాహకులు వీరేశ్ మాట్లాడుతూ, ఇలాంటి ప్రత్యేక నివాళి కార్య క్రమాలు చేయడానికి అందరూ తమ తమ సహాయసహకారాలు,ప్రేమను అందించాలని కోరారు.