ఉన్నది ఒకటే జిందగీ ఫైనల్ కలెక్షన్లు

Published On: November 22, 2017   |   Posted By:
ఉన్నది ఒకటే జిందగీ ఫైనల్ కలెక్షన్లు
రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా థియేటర్లలో తన రన్ పూర్తిచేసుకుంది. తెలుగు, రాష్ట్రాల్లో ప్రస్తుతం అంతగా ప్రభావం చూపని కొన్ని థియేటర్లలో మాత్రం ఈ సినిమా ఆడుతోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పూర్తిగా తప్పుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ఇక ఫైనల్ రన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయో చూద్దాం.
నైజాం – రూ. 6.30 కోట్లు
సీడెడ్ – రూ. 2.14 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.05 కోట్లు
గుంటూరు – రూ. 1.05 కోట్లు
ఈస్ట్ – రూ. 1.10కోట్లు
వెస్ట్ – రూ. 0.74 కోట్లు
కృష్ణా – రూ. 1.15 కోట్లు
నెల్లూరు – రూ. 0.42 కోట్లు
ఫైనల్ కలెక్షన్లు (షేర్) – రూ. 14.95 కోట్లు