ఉన్నది ఒకటే జిందగీ రివ్యూ

Published On: October 27, 2017   |   Posted By:

ఉన్నది ఒకటే జిందగీ రివ్యూ

నటీనటులు – రామ్, శ్రీవిష్ణు, అనుపమ, లావణ్య, ప్రియదర్శి,

దర్శకత్వం – కిషోర్ తిరుమల

నిర్మాత – కృష్ణచైతన్య, స్రవంతి రవికిషోర్

సంగీతం – దేవిశ్రీప్రసాద్

ఆర్ట్ – ఏఎస్ ప్రకాష్

ఎడిటింగ్ – శ్రీకర ప్రసాద్

సినిమాటోగ్రఫీ – సమీర్ రెడ్డి

విడుదల తేదీ – 27-10-2017

సెన్సార్ః  యు స‌ర్టిఫికేట్‌

నిడివి – 152 నిమిషాలు

 

అప్పుడెప్పుడో “నీ స్నేహం” అనే సినిమా వచ్చింది. ఫ్రెండ్ షిప్, లవ్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్లీ మరోసారి ఆ సినిమాను గుర్తుచేసింది రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ. అప్పటి “నీ స్నేహం”కి, ఇప్పటి రామ్ సినిమాకు పెద్ద తేడా ఉన్నట్టు అనిపించదు. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. రామ్ ఎదురుచూసిన సక్సెస్ ను అందిస్తుందా.. చూద్దాం

కథ

రామ్, శ్రీవిష్ణు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పట్నుంచి ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్నేహం వీళ్లది. ప్రాణస్నేహితులు అంటారు కదా సరిగ్గా ఆ టైపు అన్నమాట. ఇలాంటి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకి అనుపమ పరమేశ్వరన్ వస్తుంది. ఈ అమ్మాయి రాకతో ఇద్దరు స్నేహితుల మధ్య గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మరింత పెరిగి, స్నేహానికే బీటలువారేలా చేస్తుంది. అలా మనస్పర్థల కారణంగా దూరమైన ఆ ప్రాణస్నేహితులు తిరిగి ఎలా కలుసుకున్నారనేదే స్టోరీ. అసలు అనుపమ వల్ల వీళ్లిద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఎందుకొచ్చాయి..  మధ్యలోకి వచ్చిన మహ ఎవరనేది సినిమాలో ట్విస్ట్.

 

ప్లస్ పాయింట్స్

–       ఫ్రెండ్ షిప్ పై రాసుకున్న కథ

–       రామ్, శ్రీవిష్ణు యాక్టింగ్

–       2-3 కామెడీ సీన్లు

–       డైలాగులు

–       2 పాటలు

 

మైనస్ పాయింట్స్

–       నెమ్మదిగా సాగే నెరేషన్

–       హార్ట్ టచింగ్ సీన్లు 2-3 కంటే ఎక్కువగా లేకపోవడం

–       ఫస్టాఫ్ లో లెంగ్త్ ఎక్కువవ్వడం

–       కొన్ని ట్విస్టుల్ని సింపుల్ గా చెప్పేయడం

 

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

స్నేహబంధాన్ని గొప్పగా చూపించే విధంగా గతంలో ప్రేమదేశం, నీ స్నేహం, ఇద్దరు మిత్రులు లాంటి ఎన్నో సినిమాలొచ్చాయి. కథాపరంగా వాటికంటే ఏమంత గొప్పగా ఈ సినిమా అనిపించదు. కాకపోతే దర్శకుడు కిషోర్ తిరులమ రాసుకున్న సన్నివేశాలు, స్నేహం చుట్టూ అల్లుకున్న కథ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అందరికీ తెలిసిన కాన్సెప్ట్ నే హృదయానికి హత్తుకునేలా మరోసారి సింపుల్ అండ్ స్వీట్ గా చెప్పడంలో కిషోర్ తిరుమల సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఆ హృదయానికి హత్తుకునే మోతాదులో తేడాల వల్ల ఈ సినిమాకు అక్కడక్కడ పెదవి విరుపులు తప్పవు. 2-3 సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా అనిపించినప్పటికీ.. అలాంటివి మరో 3 సీన్లు పడితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది.

చిన్నప్పట్నుంచి ఫ్రెండ్ షిప్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని బలంగా, గొప్పగా కిషోర్ తిరుమల చూపించిన విధానం బాగుంది. ఈ పాత్రల్లో రామ్, శ్రీవిష్ణు సరిగ్గా సరిపోయారు. వాళ్లను తెరపై చూస్తుంటే రియల్ లైఫ్ ఫ్రెండ్స్ లా అనిపిస్తారు. ఇక వీళ్లకు సపోర్టింగ్ గా చేసిన మిగతా నటీనటులు కూడా యాప్ట్ అనిపిస్తారు. మరీ ముఖ్యంగా ప్రియదర్శి కామెడీ టైమింగ్ బాగుంది. ఇక హీరోయిన్లలో అనుపమ మరోసారి తన టాలెంట్ చూపించింది. ఇచ్చిన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసింది. సెకండాఫ్ లో వచ్చిన లావణ్య త్రిపాఠి ఫర్వాలేదనిపిస్తుంది.

కేవలం కథ, కథనం ఆధారంగా మాత్రమే ఈ సినిమాను చూడాలి. టెక్నికల్ గా ఇదో గొప్ప సినిమా కాదు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ అక్కడక్కడ మెరుస్తుంది. సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ల పనితరం అక్కడక్కడ కనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా సినిమాను ఓ 10-15 నిమిషాలు తగ్గించొచ్చదని అనిపిస్తుంది. స్రవంతి రవికిషోర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా కిషోర్ తిరుమల మరోసారి తన సెన్సిబులిటీ చూపించాడు. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో, సన్నివేశాల్ని మరింత బలంగా రాసుకోవడంతో కిషోర్ తిరుమల మరింత హోంవర్క్ చేయాల్సింది. ఇక ఇలాంటి కథలకు ప్రాణమైన రీ-రికార్డింగ్ విషయంలో ఇంకాస్త ఎక్కువ దృష్టి పెడితే బాగుండేది.

ఇలాంటి కథను ఎంచుకున్న రామ్ ను మాత్రం కచ్చితంగా అభినందించి తీరాలి. కేవలం భావోద్వేగాల మీద ఆధారంగా తీసిన ఈ సినిమా ఎంతమందిని కదిలిస్తుందనే విషయంపైనే దీని విజయం ఆధారపడి ఉంది. రెగ్యులర్ ప్రేక్షకులకు కాస్త రొటీన్ అనిపించొచ్చు కానీ, యూత్ కు కనెక్ట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుంది.

 

రేటింగ్ – 3/5