ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ  చిత్రం విష‌యంలో ఏమౌతుందో?

Published On: August 8, 2017   |   Posted By:
ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ  చిత్రం విష‌యంలో ఏమౌతుందో?
కందిరీగ త‌రువాత స‌రైన విజ‌యం లేని రామ్‌కి ఐదేళ్ల త‌రువాత విజ‌యాన్ని అందించింది నేను శైల‌జ చిత్రం. ఆ త‌రువాత వ‌చ్చిన హైప‌ర్ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. దీంతో త‌న తాజా చిత్రం ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ పై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు రామ్‌. నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల‌నే ఉన్న‌ది ఒక్క‌టే జిందగీకి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఆ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.
ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మార‌డు.. పాట  కూడా బాగా క్లిక్ అవ‌డంతో స‌ద‌రు చిత్రంపై పాజిటివ్ వైబ్రేష‌న్స్ మ‌రింత పెరిగాయి.
ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేటంటే.. రామ్ త‌న కెరీర్ మొత్త‌మ్మీద ఇప్ప‌టివ‌ర‌కు ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో  మాత్ర‌మే రెండేసి సార్లు వ‌ర్క్ చేయ‌డం.. అవి కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు కావ‌డం.  ఆ సినిమాలే.. కందిరీగ త‌రువాత సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన హైప‌ర్‌, నేను శైల‌జ త‌రువాత కిషోర్ తిరుమ‌ల‌తో చేస్తున్న ఉన్న‌ది ఒక్క‌టే జిందగీ.
హిట్ ఇచ్చిన దర్శ‌కుడితో రెండోసారి ప‌నిచేయ‌డం అనే అంశం హైప‌ర్‌కి అంత‌గా క‌లిసిరాని వైనం.. ఏడాది గ్యాప్ త‌రువాత వ‌స్తున్న రామ్ త‌దుప‌రి చిత్రం ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీతోనైనా మారుతుందేమో చూడాలి మ‌రి.