ఎంఎల్ఏ టీజర్ రివ్యూ

Published On: January 17, 2018   |   Posted By:

ఎంఎల్ఏ టీజర్ రివ్యూ


ఈమధ్య కొత్తకొత్త పదప్రయోగాలు సృష్టించడం కామన్ అయిపోయింది. తన కొత్త సినిమా ఎంఎల్ఏకు సంబంధించి మైక్రో టీజర్ రిలీజ్ చేశాడు కల్యాణ్ రామ్. ఇది టీజరే కానీ కాస్త చిన్నదన్నమాట. అసలు టీజర్ ను మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు.

టీజర్ లో మరోసారి ఎనర్జిటిక్ గా కనిపించాడు కల్యాణ్ రామ్. ఓ పొలిటికల్ లీడర్ గా, యంగ్రీయంగ్ మేన్ లుక్ లో కనిపిస్తున్నాడు. కల్యాణ్ రామ్, థర్టీ ఇయర్స్ ఫృధ్వీ కాంబినేషన్ నవ్వులు పూయించనుందనే విషయం మైక్రో టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. ఎమ్మెల్యే టైటిల్ కు కింద మంచి లక్షణాలున్న అబ్బాయి అనే క్యాప్షన్ పెట్టారు. కామెడీ పంచ్ లు పుష్కలంగా ఉన్నయనే విషయం మైక్రో టీజర్ చూస్తే అర్థమౌతోంది.

ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ హైలెట్ గా నిలిచింది. మార్చిలో సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.