ఎంసీఏ ట్రయిలర్ రివ్యూ

Published On: December 14, 2017   |   Posted By:

ఎంసీఏ ట్రయిలర్ రివ్యూ


కథ ఏదైనా కావొచ్చు, డైరక్టర్ ఎవరైనా ఉండొచ్చు. అందులో నాని హీరోగా ఉన్నాడంటే మాత్రం సినిమా మొత్తం టర్న్ అయిపోతుంది. కేవలం నాని మార్క్ మాత్రమే కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి క్వాలిటీస్ తోనే వచ్చింది ఎంసీఏ థియేట్రికల్ ట్రయిలర్. దిల్ రాజు నిర్మాణంలో, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ విడుదలైన వెంటనే అందర్నీ ఆకట్టుకుంది.

ఓ మరిది, ఓ అన్న, ఓ వదిన.. మధ్యలో ఓ విలన్. సింపుల్ గా చెప్పాలంటే ఎంసీఏ స్టోరీ ఇది. మరిదిగా నాని, అన్నగా రాజీవ్ కనకాల, వదినగా భూమిక నటించారు. నాని గర్ల్ ఫ్రెండ్ గా సాయిపల్లవి నటించింది. నాని వదిన భూమికకు వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీంతో నాని కూడా అక్కడికి షిఫ్ట్ అవుతాడు. అక్కడే హీరోయిన్ సాయిపల్లవిని కలుస్తాడు. ఓ మధ్యతరగతి కుటుంబంగా చక్కగా సాగిపోతున్న ఈ ఫ్యామిలీలోకి విలన్ ఎంటర్ అవుతాడు. అసలేం జరిగిందనేది మిగతా సినిమా కథ. ఈ స్టోరీని ఇంట్రెస్టింగ్ గా ట్రయిలర్ లో చెప్పారు.

నాని యాక్టింగ్, లుక్స్ ట్రయిలర్ లో మెయిన్ ఎట్రాక్షన్స్. వదినగా భూమిక ఎప్పీయరెన్స్ బాగుంది. సాయిపల్లవి ఎప్పట్లానే క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ఓవరాల్ గా నాని నుంచి మరో ప్రామిసింగ్ మూవీ రాబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది ఎంసీఏ ట్రయిలర్.