ఎంసీఏ మూవీ రివ్యూ

Published On: December 21, 2017   |   Posted By:

ఎంసీఏ మూవీ రివ్యూ

బ్యానర్‌: శ్రీ  వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు:  నాని, సాయిప‌ల్ల‌వి, భూమిక‌, విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ఆమ‌ని. పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల‌కిషోర్‌ త‌దిత‌రులు
డైలాగ్స్‌:  మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా
ఎడిట‌ర్‌:   ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: రామాంజ‌నేయులు
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
కెమెరా:స‌మీర్‌రెడ్డి
నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు
Censor Rating:-“U/A”
Run time – 143 minutes

నాని, దిల్‌రాజు ..ఇద్ద‌రు ప్ర‌స్తుతం మంచి స‌క్సెస్‌ల‌ను సాధిస్తున్నారు. ఒక‌రేమో హీరో..మ‌రొక‌రేమో నిర్మాత‌. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ ఏడాదిలో `నేను లోక‌ల్‌` సినిమా వ‌చ్చి పెద్ద హిట్ సాధించింది.  ఈ ఏడాదికి నిర్మాత‌గా ఇప్ప‌టికే ఐదు విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న నిర్మాత దిల్‌రాజు ఆరో స‌క్సెస్ అంటే డ‌బుల్ హ్యాట్రిక్ కోసం ప్లాన్ చేసిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంసీఏ`. అప్పుడెప్పుడో త‌న బ్యాన‌ర్‌లో `ఓ మై ఫ్రెండ్` అనే ప్లాప్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శకుడు, త‌న బ్యానర్‌లో ఫిదా వంటి హిట్ మూవీలో న‌టించిన సాయిప‌ల్ల‌వి హీర‌యిన్‌గా, స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణించి, గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక ఇన్ని అంశాలు ఈ ఎం సీఏ సినిమాలో ఉండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ అంచ‌నాలు ఎంత వ‌ర‌కు రీచ్ అయ్యాయో తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం..

వరుస విజయాలతో ఊపుమీదున్నాడు నాని. అటు దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ కోసం వెయిటింగ్. మరోవైపు హీరోయిన్ సాయిపల్లవి తెలుగులో ద్వివిఘ్నాన్ని అధిగమిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా కీలకమైన ఈ ముగ్గురు వ్యక్తులు ఆశలుపెట్టుకున్న సినిమా ఎంసీఏ. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వాళ్లను ఆదుకుందా.. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ
కథ
అన్నదమ్ములైన నాని, రాజీవ్ కనకాల చాలా క్లోజ్ గా ఉంటారు. అన్నను వదిలి ఉండలేడు నాని. అలాంటిది వాళ్లిద్దరి మధ్యలోకి భూమిక వస్తుంది. భూమికను పెళ్లిచేసుకున్న తర్వాత నాని, రాజీవ్ కనకాల మధ్య గ్యాప్ వస్తుంది. దీంతో వదిన అంటే కాస్త చిరాకు పడుతుంటాడు నాని. తన అన్నను దూరం చేసిన వదినపై కాస్త కోపం కూడా ఉంటుంది.
ఇదిలా ఉండగా.. సడెన్ గా వదినతో కలిసి ఉండాల్సి వస్తుంది నానికి. గవర్నమెంట్ ఉద్యోగి అయిన భూమిక వరంగల్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీంతో ఖాళీగా ఉన్న నాని తప్పనిసరి పరిస్థితుల్లో వదినతో కలిసి వరంగల్ కు వెళ్తాడు. ఇంట్లో పనులన్నీ నానితో చేయిస్తుంది భూమిక. అలా ఓవైపు వదినపై చిరాకుపడుతున్న నాని మరోవైపు సాయిపల్లవితో ప్రేమలో కూడా పడతాడు. ఇలా ఇంటర్వెల్ వరకు సాఫీగా సాగిపోతున్న కథలోకి వరంగల్ శివ అనే క్యారెక్టర్ ఎంటరవుతుంది. ఈ
డ్యూటీ విషయంలో భూమికకు, వరంగల్ శివ (విజయ్ వర్మ)కు మధ్య గొడవ జరుగుతుంది. దీంతో ఆమెను చంపి అడ్డుతొలిగించుకోవాలనుకుంటాడు శివ. అనుకోకుండా ఆ విషయం నానికి తెలుస్తుంది. అప్పటివరకు వదినపై ఉన్న కోపతాపాలన్నీ తగ్గిపోతాయి. ఎలాగైనా వదినను కాపాడుకోవాలని కంకణం కట్టుకుంటాడు. ఈ విషయం తెలిసిన శివ, ఎలాగైనా భూమికను చంపేస్తానని నానితో శపథం చేస్తాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన నాని, విలన్ నుంచి వదినను ఎలా కాపాడుకున్నాడనేది బ్యాలెన్స్ కథ.

ప్లస్ పాయింట్స్
–      నాని పెర్ఫార్మెన్స్
–      సాయిపల్లవి చలాకీతనం
–      హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ
–      భూమిక సెటిల్ యాక్టింగ్
– ఫ‌స్టాఫ్ కామెడీ

– కెమెరా ప‌నిత‌నం
–      క్లయిమాక్స్
మైనస్ పాయింట్స్
–      రొటీన్ స్టోరీ
–      రొటీన్ పాటలు
–      క్లయిమాక్స్ లో లాజిక్స్ లేకపోవడం
–      దర్శకత్వంలో లోపాలు
–      ఊహించే విధంగా ఉండే సన్నివేశాలు
బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ
ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి అనే టైటిల్ పెట్టినప్పుడు చాలామంది కొత్తగా ఫీల్ అయ్యారు. నాని లుంగీ కట్టుకొని పాల ప్యాకెట్లు పట్టుకొని వస్తుంటే మరింత ఫ్రెష్ గా ఫీలయ్యారు. నిజమే.. సినిమాలో ఈ రెండు మాత్రమే కొత్తగా ఉన్నాయి. మిగతాదంతా రొటీన్. ఇంటర్వెల్ బ్యాంగ్ కే సినిమా ఏంటో అర్థమైపోతుంది.. సెకెండాఫ్ ఎందుకు చూడాలనే ప్రశ్న మదిని తొలుస్తుంది.
నటీనటుల విషయానిస్తే.. మరోసారి ఎంసీఏను తన భుజాలపై మోశాడు నాని. తన నేచురల్ యాక్టింగ్, అదిరిపోయే డైలాగ్ డెలివరీతో సినిమాను ఆసాంతం నడిపించాడు. ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే నాని లేకపోతే ఈ సినిమా డిజాస్టర్ అయ్యేది. ఇక ఫిదాతో ఆకట్టుకున్న సాయిపల్లవి ఈ సినిమాలో కూడా అంతే చలాకీగా కనిపించింది. నాని-సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఎటొచ్చి సాయిపల్లవికి ఇందులో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ లేదు. నాని తర్వాత అలాంటి మంచి పాత్ర ఏదైనా ఉందంటే అది భూమికదే. యూనిట్ లో అంతా చెప్పినట్టు భూమికకు ఇది క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పునాది వేసే చిత్రమే. ఆమె సెటిల్ యాక్టింగ్ చాలా చోట్ల ఆకట్టుకుంటుంది. ఇతర ముఖ్యపాత్రలు పోషించిన విజయ్ వర్మ, రాజీవ్ కనకాల, ఆమని, సీనియర్ నరేష్, తమ పాత్రల మేరకు నటించారు. సినిమాకు కాస్తోకూస్తో యాడ్ అయ్యారు.
టెక్నికల్ గా ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్నంతలో సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం కాస్త బాగుంది. దేవిశ్రీప్రసాద్ అయితే ఎంసీఏకు ఏమాత్రం కలిసిరాలేదు. థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఏ ఒక్క పాట గుర్తుండదు. రీరికార్డింగ్ లో కూడా తన మేజిక్ చూపించలేకపోయాడు. మామిడాల తిరుపతి డైలాగ్స్ ఓ రెండు చోట్ల ఆకట్టుకుంటాయి. కొన్నిచోట్ల ప్రాసలు కావాలని పెట్టినట్టు అనిపించింది. దర్శకత్వంలో లోపాలు చూపించిన శ్రీరామ్ వేణు.. కథ, స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని లోపాల్ని చూపించాడు. నిర్మాణ విలువల్లో దిల్ రాజు మరోసారి కాంప్రమైజ్ కాలేదు.
ఓవరాల్ గా ఎంసీఏ సినిమా చూస్తే అది కేవలం నాని కోసమే చూడాలి. నాని మరోసారి తన టాలెంట్ మొత్తం చూపించాడు. కానీ కేవలం అతడొక్కడే ఈ సినిమాను హిట్ చేయలేడు. అతడికి కథ, కథనం నుంచి సపోర్ట్ దక్కలేదు. నాని ఎంత కష్టపడినా అంతిమంగా ఎంసీఏ సినిమా మాత్రం ఎలాంటి చమక్కులు లేని ఓ యావరేజ్ సినిమాగా నిలిచిపోతుంది.
రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా..ఎంటర్ టైనింగ్ పంథాలో చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌ను సినిమా మెప్పిస్తుంది.

చివ‌ర‌గా..ఎంసీఏ..అల‌రించే మిడిల్ క్లాస్ కుర్రాడు
రేటింగ్ – 3/5