ఎన్టీఆర్‌తో త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు

Published On: August 30, 2017   |   Posted By:

ఎన్టీఆర్‌తో త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు

ఈమధ్య మన హీరోలు, దర్శకులు ఇతర భాషల నుంచి సంగీత దర్శకుల్ని దిగుమతి చేసుకోవడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ తెలుగులో ఇటీవల వచ్చిన చాలా సినిమాలకు సంగీతాన్నందించాడు.

‘కొలవెరి ఢీ’ పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనిరుధ్‌ తాజాగా పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేయబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. హీరోయిన్‌గా అను ఇమ్మానుయేల్‌ నటిస్తుందని, ఈ సినిమాకి కూడా అనిరుధ్‌నే సంగీత దర్శకుడుగా తీసుకుంటున్నాడని సమాచారం. మరి ఎన్టీఆర్‌ సినిమాకి సంబంధించి వచ్చిన ఈ వార్త నిజమో కాదో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.