ఎన్టీఆర్‌తో రంభ‌

Published On: May 17, 2018   |   Posted By:

ఎన్టీఆర్‌తో రంభ‌

సీనియ‌ర్ హీరోయిన్ రంభ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసింది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ రంభ‌ను ఓ కీల‌క పాత్ర‌లో న‌టింప‌చేయ‌నున్నారు. మ‌రి రంభ చేయ‌బోయే పాత్ర గురించి పూర్తి వివ‌రాలు తెలియ‌డం లేదు. అయితే ఇంతకు ముందు నాగ‌, య‌మ‌దొంగ చిత్రాల్లో ఎన్టీఆర్‌తో రంభ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించింది. ఇప్పుడు స్పెష‌ల్ పాత్రలో న‌టిస్తుంది.