ఎన్టీఆర్ `జైల‌వ‌కుశ` ట్రైలర్ రికార్డ్‌…

Published On: September 12, 2017   |   Posted By:

ఎన్టీఆర్ `జైల‌వ‌కుశ` ట్రైలర్ రికార్డ్‌…

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన సినిమా `జై ల‌వ‌కుశ`. క‌ల్యాణ్‌రామ్ నిర్మాత‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆదివారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ ట్రైల‌ర్ 24 గంట‌ల్లో 7.54 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ను రాబ‌ట్టుక‌ని కొత్త రికార్డును క్రియేట్ చేసింది. బాహుబ‌లి త‌ర్వాత అదే స్థాయిలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ట్రైల‌ర్ ఇదేన‌ట‌. ఈ విష‌యంపై తార‌క్ కూడా ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. జై ల‌వ‌కుశ ట్రైల‌ర్‌కు వ‌చ్చిన స్పంద‌న చాలా సంతోషాన్నిచ్చింది. ఇంత‌కుముందు చెప్పిన‌ట్లు నా న‌ట‌న‌తో అభిమానులు సంతృప్తి చెందేలా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని  ఎన్టీఆర్ తెలిపారు.