ఎన్టీఆర్ జై ల‌వకుశ‌ మ‌రో టీజ‌ర్ సిద్ధం

Published On: August 3, 2017   |   Posted By:

ఎన్టీఆర్ జై ల‌వకుశ‌ మ‌రో టీజ‌ర్ సిద్ధం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై ల‌వకుశ‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, ల‌వ‌, కుశ అనే పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జై అనే క్యారెక్ట‌ర్ నెగ‌టివ్ షేడ్స్‌తో ఉంటుంది. అల్రెడి ఈ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన టీజర్ విడుద‌లై సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో రెండో క్యారెక్ట‌ర్ ల‌వ‌కుమార్ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రంగం సిద్ధం చేశారు.

ఆగ‌స్ట్ 7న రాఖీ పండుగ సంద‌ర్భంగా ల‌వ‌కుమార్ పాత్ర టీజ‌ర్‌ను ఉద‌యం 10.35 నిమిషాల‌కు విడుద‌ల చేస్తార‌ట‌. జై క్యారెక్ట‌ర్ నెగ‌టివ్ షేడ్స్‌తో పాటు న‌త్తి కూడా ఉంటుంది. మ‌రి ల‌వ‌కుమార్ పాత్ర‌లో ఎన్టీఆర్ ఎలా మెప్పిస్తాడోన‌ని అంద‌రిలో క్యూరియాసిటీ ఏర్ప‌డింది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.