ఎన్టీఆర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు

Published On: October 11, 2017   |   Posted By:

ఎన్టీఆర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి విదిత‌మే. వ‌ర్మ ఈ బ‌యోపిక్‌లో ఎక్కువ శాతం ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం, ఆయ‌న ఎదుర్కొన్న ప‌రిస్థితులు, అనుభ‌వించిన క్షోభ త‌దిత‌ర విష‌యాల‌ను ఇందులో చూపిస్తాన‌ని తెలిపారు. ఈ సినిమాకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు కూడా పెట్టారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి వ‌ర్మ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి అస‌లు ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు ప్ర‌కాష్ రాజ్ ఈ స‌స్పెన్స్‌కు తెర దించుతు ఎన్టీఆర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తాడ‌ని తెలిపారు. అయితే ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌ని మాత్రం చెప్ప‌లేదు. ఈ పాత్ర‌లో రోజా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.