ఎన్టీఆర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు చేయ‌డం లేద‌ట‌

Published On: October 11, 2017   |   Posted By:

ఎన్టీఆర్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు చేయ‌డం లేద‌ట‌

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి విదిత‌మే. వ‌ర్మ ఈ బ‌యోపిక్‌లో ఎక్కువ శాతం ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం, ఆయ‌న ఎదుర్కొన్న ప‌రిస్థితులు, అనుభ‌వించిన క్షోభ త‌దిత‌ర విష‌యాల‌ను ఇందులో చూపిస్తాన‌ని తెలిపారు. ఈ సినిమాకు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు కూడా పెట్టారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి వ‌ర్మ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి అస‌లు ఎన్టీఆర్, ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎన్టీఆర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ అలాంటివేం లేద‌న్నారు. అయితే ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌ని మాత్రం చెప్ప‌లేదు. ఈ పాత్ర‌లో రోజా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.