ఎన్టీఆర్ బయోపిక్ పై పూర్తి క్లారిటీ

Published On: May 28, 2018   |   Posted By:

ఎన్టీఆర్ బయోపిక్ పై పూర్తి క్లారిటీ

మొన్నటివరకు తేజ దర్శకత్వంలో వస్తుందని అంతా భావించారు. కానీ హఠాత్తుగా తేజ తప్పుకోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై చాలా అనుమానాలు రేకెత్తాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది. స్వయంగా బాలకృష్ణ రంగంలోకి దిగి ఈ బయోపిక్ పై స్పష్టత ఇచ్చారు.

ఎన్టీఆర్ ప్రాజెక్టును క్రిష్ డైరక్ట్ చేస్తారని ప్రకటించాడు  బాలకృష్ణ. గతంలో బాలయ్య-క్రిష్ కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా వచ్చింది. అది బాలయ్యకు వందో సినిమా కావడం విశేషం. ఇప్పుడు ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ ప్రాజెక్టు కూడా క్రిష్ కు చేరింది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రీన్ ప్లే పూర్తయింది. తేజ ఆ పని పూర్తిచేశాడు. స్క్రీన్ ప్లేకు తగ్గట్టు బుర్రా సాయిమాధవ్ మాటలు కూడా రాశాడు. ఇప్పుడీ స్క్రీన్ ప్లేలో మార్పులు చేయాలని క్రిష్ భావించాడు. తనకు అప్పగించిన ఈ బాధ్యతకు నూటికి నూరు శాతం సక్సెస్ చేస్తానని, అందరినీ అలరించేలా బయోపిక్ ను తెరకెక్కిస్తానని క్రిష్ ప్రకటించాడు. జులై నుంచి ఈ బయోపిక్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.