ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాలీవుడ్ న‌టుడు

Published On: March 31, 2018   |   Posted By:
ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాలీవుడ్ న‌టుడు
మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌` రీసెంట్‌గా స్టార్ట‌య్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన‌ప్ప‌టి నుండి రాజకీయాల్లో ముఖ్య‌మంత్రిగా పీఠాన్ని అధిరోహించే దాక‌.. సినిమా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్పుడు ఆయ‌న్ను ప‌ద‌వీచ్యుతుడ్ని  చేసిన వ్య‌క్తి నాదెండ్ల భాస్క‌ర‌రావు..ఆయ‌న నుండి మ‌ళ్లీ ఎన్టీఆర్ ప‌దవిని ఎలా తీసుకున్నార‌నేదే సినిమాలో కీల‌కాంశంగా ఉంటుంది. కీల‌క‌మైన నాదెండ్ల భాస్క‌ర‌రావు పాత్ర‌ను ఇప్పుడు బాలీవుడ్ న‌టుడు ప‌రేశ్ రావ‌ల్ పోషించ‌బోతున్నాడ‌ట‌. ద‌ర్శ‌క నిర్మాత‌లు పులువురి పేర్ల‌ను పరిశీలించినా.. ప‌రేశ్ రావ‌ల్ ప‌క్కాగా సూట్ అవుతాడ‌ని ఆయ‌న్నే తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.