ఎన్టీఆర్ బ‌యోపిక్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

Published On: August 31, 2017   |   Posted By:

ఎన్టీఆర్ బ‌యోపిక్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. హిట్ చిత్రాల క‌థానాయ‌కుడిగా, దర్శ‌కుడిగా, నిర్మాత‌గా చ‌ల‌న‌చిత్ర రంగంలో చెరిగిపోని ముద్ర ఎన్టీఆర్‌ది.

సినిమాల్లో బిజీగా ఉన్న తరుణంలోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్య‌మంత్రిగానూ న‌టించారు. సినిమా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే నంద‌మూరి తార‌క‌రామారావు చ‌రిత్ర‌తో ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఓ సినిమాను రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ నంద‌మూరి బ‌యోపిక్‌ను ఎవ‌రు తెర‌కెక్కిస్తారా? అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది. దీనికి బాల‌కృష్ణ తాజాగా స‌మాధానం ఇచ్చారు. “ఇంకో రెండు మూడు రోజుల్లో నాన్న‌గారి బ‌యోపిక్‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ద‌ర్శ‌కుడి పేరును వెల్ల‌డిస్తాం. ప్ర‌స్తుతం నాన్న‌గారితో స‌న్నిహితంగా మెలిగిన వ్య‌క్తులు, మా బంధువులు, ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసిన వారు.. ఇలా అంద‌రినీ క‌లుస్తూ ఉన్నాను. ఇటీవ‌ల చెన్నైకి వెళ్లాను. అక్క‌డ కూడా చాలా మందిని క‌లిశాను“ అని అన్నారు. అంటే సెప్టెంబ‌ర్ 1న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `పైసా వ‌సూల్‌` సినిమా విడుద‌ల ఉంది. ఆ త‌ర్వాతే తాజా నంద‌మూరి బాలకృష్ణ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తార‌న్న‌మాట‌.