ఎన్టీఆర్ సినిమా పక్కా చేసిన అనిరుధ్

Published On: October 17, 2017   |   Posted By:
ఎన్టీఆర్ సినిమా పక్కా చేసిన అనిరుధ్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలోనే కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ మూవీని డిసెంబర్ లో ప్రారంభించి, జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకొస్తారనే టాక్ నడుస్తోంది. దీంతో పాటు ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తాడనే రూమర్ కూడా ఉంది. ఎట్టకేలకు ఈ పుకారుపై క్లారిటీ ఇచ్చాడు అనిరుధ్.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకు తనే సంగీతం అందించబోతున్నాననే విషయాన్ని అనిరుధ్ నిర్థారించాడు. నిన్న ఈ కుర్ర కంపోజర్ తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాకు సంగీతం అందించే విషయాన్ని పక్కా చేశాడు.
ప్రస్తుతం పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు అనిరుధ్. ఇతడు కంపోజ్ చేసిన ఓ చిన్న సాంగ్ బిట్ ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయగా.. అది పెద్ద హిట్ అయింది. పవన్ సినిమాకు ఇచ్చిన ట్యూన్స్ నచ్చడంతో, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా అనిరుధ్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.