ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేయ‌డం లేదట‌…

Published On: September 7, 2017   |   Posted By:

ఎన్టీఆర్ సినిమా రీమేక్ చేయ‌డం లేదట‌…

ఎన్టీఆర్‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం టెంప‌ర్‌. ఎన్టీఆర్‌ను డిఫ‌రెంట్ యాంగిల్‌లో పూరి ప్ర‌జెంట్ చేయ‌డంతో పాటు ఎన్టీఆర్ ఎనర్జ‌టిక్ పెర్ఫామెన్స్ తోడ‌వ‌డంతో సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల ప్ర‌ధాన నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమాను త‌మిళంలో విశాల్ రీమేక్ చేస్తుండ‌గా, బాలీవుడ్‌లో ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే రోహిత్ శెట్టి టెంప‌ర్ రీమేక్‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించాడు. టెంప‌ర్‌లో కీల‌క‌మైన నాలుగైదు స‌న్నివేశాల‌ను మాత్ర‌మే ఉప‌యోగించుకుంటున్నానే త‌ప్ప‌, సినిమాను రీమేక్  చేయ‌డం లేదు..స్క్రిప్ట్ నేను స్వంతంగా త‌యారు చేసుకున్నాన‌ని రోహిత్ శెట్టి స్పందించారు. హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదని, 2018లో త‌న కొత్త సినిమా షూటింగ్ ఉంటుంద‌ని రోహిత్ శెట్టి తెలిపారు.