ఎన్టీఆర్ హీరోయిన్ దాదాపు ఖ‌రారే

Published On: February 1, 2018   |   Posted By:

ఎన్టీఆర్ హీరోయిన్ దాదాపు ఖ‌రారే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుండి సినిమాపై సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్రివిక్ర‌మ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్ర‌ద్ధాక‌పూర్ పేరుని ప‌రిశీలించారు. అయితే శ్ర‌ద్ధా క‌పూర్ ఒప్పుకోలేదో మ‌రేదైనా కార‌ణ‌మో కానీ.. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఓకే చేశార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో న‌టిస్తున్న పూజా హెగ్డే మ‌హేష్ 25వ చిత్రంలో న‌టించ‌నుంది. ఆ సినిమాతో పాటు ఎన్టీఆర్‌తో కూడా జ‌త క‌ట్ట‌నుండటం  విశేషం.