ఎన్నారై యువ‌కుడిగా గోపీచంద్‌

Published On: February 20, 2018   |   Posted By:

ఎన్నారై యువ‌కుడిగా గోపీచంద్‌

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ ప్ర‌స్తుతం త‌న 25వ సినిమాను ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురానున్నారు. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్‌తో సినిమా రూపొంద‌నుంది. చ‌క్రి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా కె.కె.రాధామోహ‌న్ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.  ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో గోపీచంద్ ఎన్నారై యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాడ‌ట‌. మెహ‌రీన్ టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మంచి హిట్ కోసం కొంత కాలంగా వెయిట్ చేస్తోన్న గోపీచంద్‌కి త‌న 25వ సినిమా మంచి స‌క్సెస్‌ను తెచ్చిపెట్టాల‌ని ఆశిద్దాం.