ఎమ్మెల్యే ట్రయిలర్ రివ్యూ

Published On: March 17, 2018   |   Posted By:
ఎమ్మెల్యే ట్రయిలర్ రివ్యూ

కల్యాణ్ రామ్ అప్ కమింగ్ మూవీ ఎమ్మెల్యే. మంచి లక్షణాలున్న అబ్బాయ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. 23న విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. తాజాగా ట్రయిలర్ లాంచ్ చేశారు. టైటిల్ లో చెప్పినట్టే.. మంచి లక్షణాలున్న అబ్బాయిగా కల్యాణ్ రామ్ ను చూపించారు.
ఈ సినిమాలో కేవలం లవ్, యాక్షన్ మాత్రమే కాకుండా పొలిటికల్ టచ్ కూడా ఉందనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు. నిజానికి ఈ సందేహం టీజర్ విడుదలైనప్పుడే చాలామందికి కలిగింది. ట్రయిలర్ తో ఆ అనుమానాలు తీరిపోయాయి. దీనికి తోడు సినిమాలో మంచి కామెడీ ఉండబోతోందనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో చెప్పారు. మరీ ముఖ్యంగా చివర్లో రజనీకాంత్ ను ఇమిటేట్ చేస్తూ కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ సూపర్.
ఓవరాల్ గా సినిమాపై అంచనాల్ని ఇంకాస్త పెంచేదిగా కట్ అయింది ఎమ్మెల్యే ట్రయిలర్. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర మాధవ్ డైలాగ్స్ ట్రయిలర్ లో బాగా క్లిక్ అయ్యాయి.