ఎమ్మెల్యే మూవీ సెకెండ్ సింగిల్ రివ్యూ

Published On: March 13, 2018   |   Posted By:

ఎమ్మెల్యే మూవీ సెకెండ్ సింగిల్ రివ్యూ


కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ఎమ్మెల్యే. మంచి లక్షణాలున్న అబ్బాయ్ అనేది ఈ సినిమా
క్యాప్షన్. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు మరో సింగిల్ రిలీజ్ చేశారు. మణిశర్మ కంపోజిషన్ లో వచ్చిన ఆ సింగిల్ ఎలా ఉందో చూద్దాం

హే ఇందు అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. నిజానికి  ఈ పాటపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే మణిశర్మ-కాసర్ల శ్యామ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన బొంబాట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. లై సినిమాలో ఉన్న ఆ పాట.. 2017 చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మళ్లీ ఆ కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట.. వినడానికి క్యాచీగా, పాడుకోవడానికి హమ్మింగ్ గా ఉంది. బొంబాట్ సాంగ్ రేంజ్ లో హిట్ అవుతుందా లేదా అనే విషయం మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఉపేంద్ర మాధవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 23న థియేటర్లలోకి రానుంది.