‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా రివ్యూ

Published On: April 26, 2019   |   Posted By:

‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా రివ్యూ

గతంలోకి వెళ్లి గేమ్ ఆడిన…  (‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ రివ్యూ)

రేటింగ్  : 3.5/5   

మొత్తానికి  మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’వచ్చేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకునే వాతావరణం థియోటర్స్ దగ్గర కనపడింది. ఓ హాలీవుడ్ సినిమాకు ఇంత క్రేజా అంటూ అంతా ఆశ్చర్యపోయే రీతిలో జనం కిటకిటలాడిపోయారు. అందుకు కారణం ఎవెంజర్స్ క్యారక్టర్స్ తో వారికి ఆల్రెడీ అనుబంధం ఏర్పడి ఉండటమే. ఆ సినిమాల సీరిస్ ని వారు ఎంజాయ్ చేసి ఉండటమే. దాంతో ఇన్ఫినిటి వార్ కు కంటిన్యూషన్ గా వచ్చిన ఈ ఎండ్ గేమ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని సినిమా అందుకోగలిగిందా ? అసలు ఈ సినిమా కథేంటి ? ఇదే సీరిస్ లో వచ్చిన మిగతా సినిమాల్లాగ దీనిని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయగలిగారా ? హైలెట్స్ ఏమిటి ? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

ఇదే కథ…

ఇన్ఫినిటీ వార్ ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచీ ఈ సినిమా మొదలవుతుంది. ఆ పార్ట్ లో ఇన్ఫినిటి స్టోన్స్ సేకరించిన థానోస్… భూమి మీద ఏభై శాతం జనాన్ని నాశనం చేసేస్తాడు. ఆ తర్వాత నాశనం అయిన ప్రపంచంతో తమకు సంబందం ఏమిటని థావోస్ వేరే గ్రహం పైకి నివాసం మార్చేసాడు. మరోప్రక్క ఆ వినాశనంలో తమలో కొందరిని సైతం కోల్పోతారు ఎవెంజర్స్. ఆ బాధే కాక..ఆ వినాశనాన్ని ఆపలేకపోయామన్న బాధ వారిలో ఉంటుంది. ఆ జ్ఞాపకాలు, బాధతోనే ఐదు సంవత్సరాలు గడిపేస్తారు. ఈ లోగా  ఆ వినాశనంలో కోల్పోయామనుకున్న యాంట్ మ్యాన్ తిరిగి రావటంతో యండ్ గేమ్ కు అంకురార్పణ జరుగుతంది. 

ఇన్ఫినిటివార్ లో చనిపోయిన వాళ్లు వెనక్కి తిరిగి రావాలంటే గతంలోకి టైమ్ ట్రావెల్ ద్వారా ప్రయాణించాలని అంటాడు. గతంలోకి వెళ్లి థానోస్ కన్నా ముందే ఆ ఇన్పినిటీ స్టోన్స్ ని సేకరిస్తే ఆ వినాశనం జరగదని చెప్తాడు.దాంతో వారంతా టైమ్ ట్రావెల్ ద్వారా గతంలోకి వెళ్లి ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ ని సేకరిస్తారు. అంతేకాదు తాము కోల్పోయిన తమ వాళ్లను కలుసుకుంటారు. అయితే ఈ విషయం థానోస్ కు తెలుస్తుంది. తన ప్లాన్ ని చెడకొట్టడానికి ఎవేంజర్స్ వేసిన ఎత్తు తెలుసుకుని వారిపై యుద్దం ప్రకటిస్తాడు. ఆ ఇన్ఫినిటి స్టోన్స్ ని తనే సొంతం చేసుకోవాలనుకుంటాడు. అప్పుడేం జరిగింది ? థానోస్ గెలిచాడా ? ఎవెంజర్స్ విజయం సాధించారా ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ … 

ఎండ్ గేమ్ సినిమా పెరిగిన అంచనాలను ఈజీగా రీచ్ అయ్యిందనే చెప్పాలి. అలాగే ఎక్కువ కాలం గుర్తుండాలనో ఏమో కానీ ఈ సీరిస్ లో ఎమోషన్స్ కు ఎక్కువ చోటు ఇచ్చారు. థావోస్ వల్ల తమ వాళ్లను కోల్పోయిన ఎవేంజర్స్ బాధ, తిరిగి గతంలోకి వెళ్లి అక్కడ వాళ్ళను కలిసి ఎమోషన్ ఫీలవటం, మళ్లీ చివర్లో తమలో ఒకరు త్యాగం చేయటం, ఫేర్ వెల్ ఇవ్వటం వంటి సీన్స్ తో ఈ సినిమాని నింపారు. అలాగని యాక్షన్ సీన్స్ లోటమే లేదు. సెకండాఫ్ లో థానోస్ పైకి ఎవెంజర్స్ యుద్దం ప్రకటించేసీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. 

 మైనస్

ఎవేంజర్స్ సీరిస్ లో ఆఖరుగా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మిగతా సీరిస్ లలో ఉన్నదాని కన్నా చాలా తక్కువ ఉంటాయి. అలాగే సినిమాలో క్లైమాక్స్ లో విలన్ థానోస్ నాశనం అయ్యాక కథ చాలా సేపు నడుస్తుంది. ప్రతీ క్యారక్టర్ కు ముగింపు చూపిస్తారు. అయితే మిగతా పార్ట్ లు లేకపోవటంతో వేరే దారిలేక ఇలా చేసినట్లు మనకు అర్దం అవుతుంది. ఆ ఎపిసోడ్ ని ట్రిమ్ చేస్తే సరిపోతుంది.

టెక్నికల్ గా…

ఈ సినిమాకు ఏవి ప్రాణంగా నిలుస్తాయని భావిస్తామో వాటిన్నటి మీదా పూర్తి దృష్టి పెట్టి మాగ్జిమం అవుట్ ఫుట్ తీసుకున్నారు దర్శకుడు. వీ.ఎఫ్.ఎక్స్,  గ్రాఫిక్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ క్రాఫ్ట్ కేక పెట్టిస్తుంది.   

చూడచ్చా…

ఎవేంజర్స్ సీరిస్ ప్రతీ అభిమాని ఖచ్చితంగా ఎలాగో చూస్తారు. మిగతా వాళ్లు ఈ సినిమా లో క్యారక్టర్స్ , థీమ్ గురించి తెలుసుకుని వెళ్తే బాగా అర్దమవుతుంది. 

ఆఖరి మాట

ఎండ్ గేమ్ అన్నారు కానీ ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ రెస్పాన్స్ చూసి ఇక్కడితో ఆగుతారంటే మాత్రం నమ్మలేం.

తెర ముందు… వెనక..

నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌ తదితరులు. 

దర్శకత్వం : ఆంథోనీ రుస్సో, జో రుస్సో

నిర్మాత : కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ

సంగీతం : అలాన్ సిల్వెస్ట్రీ

సినిమాటోగ్రఫర్ : ట్రెంట్ ఓపాలోచ్

ఎడిటర్ : జెఫ్రీ ఫోర్డ్