ఏపీ, నైజాంలో స్పైడర్ మొదటి రోజు వసూళ్లు

Published On: September 28, 2017   |   Posted By:

ఏపీ, నైజాంలో స్పైడర్ మొదటి రోజు వసూళ్లు

భారీ స్థాయిలో విడుదలైన స్పైడర్ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది. ఓ వైపు జై లవకుశ సినిమా నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పైడర్ కు అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఏకంగా 17 కోట్ల 13 లక్షల రూపాయల షేర్ సాధించింది. వీకెండ్ లో కాకుండా.. బుధవారం విడుదలైన ఓ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి. ఇక నైజాంలో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన స్పైడర్ సినిమా 3 కోట్ల 90లక్షల రూపాయల షేర్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు స్పైడర్ సాధించిన షేర్ వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 3.90 కోట్లు
సీడెడ్ – రూ. 3.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ 1.40 కోట్లు
ఈస్ట్ – రూ. 2.20 కోట్లు
వెస్ట్ – రూ. 1.35 కోట్లు
గుంటూరు – రూ. 2.40 కోట్లు
కృష్ణా – రూ. 1.35 కోట్లు
నెల్లూరు – రూ. 1.03 కోట్లు

ఏపీ, నైజాం మొత్తం షేర్ – 17.13 కోట్లు