ఏప్రిల్ 6న ఆచారి అమెరికా యాత్ర

Published On: March 22, 2018   |   Posted By:

ఏప్రిల్ 6న ఆచారి అమెరికా యాత్ర

మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ హీరోహీరోయిన్లుగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆచారి అమెరికా యాత్ర. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ప్లే చేశారు. విష్ణు-బ్రహ్మి కామెడీ టోటల్ సినిమాకే హైలెట్ కాబోతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంతకంటే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

గతంలో జి. నాగేశ్వరరెడ్డి, విష్ణు కాంబోలో దేనికైనా రెడీ, ఈడోరకం-ఆడోరకం లాంటి సినిమాలొచ్చాయి. అదే కోవలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా కూడా తెరకెక్కింది. ఏప్రిల్ 6న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. కథ ప్రకారం అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు మేకర్స్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తి చౌదరి, కిట్టు కలిసి నిర్మించిన ఈ సినిమాకి ఎం.ఎల్ కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.