ఒరేయ్ బామ్మర్ది చిత్రం ట్రైలర్ విడుదల

Published On: August 4, 2021   |   Posted By:
 
ఒరేయ్ బామ్మర్ది చిత్రం ట్రైలర్ విడుదల
 
 
సిద్ధార్థ్, జీవీ ప్ర‌కాశ్ కుమార్ హీరోలుగా ‘బిచ్చ‌గాడు’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘శివ‌ప్పు మంజ‌ల్ ప‌చ్చై’ చిత్రం రూపొందింది. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ‘ఒరేయ్ బామ్మర్ది’గా ఆగ‌స్ట్ 13న‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం(ఆగ‌స్ట్ 4న) రోజున విడుద‌ల చేశారు.
 
ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే..
 
‘‘పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ.. వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బ‌త‌కాల్సి వ‌స్తుంది. డిపార్ట్‌మెంట్ లోప‌లైనా, బ‌య‌టైనా ఎవ‌రితోనూ నిజాయ‌తీగా ఉండలేక‌పోతున్నాను. సో.. ఈ లోకంలో ఎవ‌రితో ఒకరితోనైనా 200 శాతం హానెస్ట్‌గా ఉండాల‌నుకుంట‌న్నాను’’ అంటూ సిద్ధార్థ్ త‌న భార్య లిజోమోల్ జోస్‌తో చెప్పే ఓ ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. 
 
‘మీ త‌మ్ముడు న‌న్ను ప్రేమిస్తున్నాడు. నాకు వాడంటే బాగా ఇష్టం’ అని హీరోయిన్ కశ్మీరా ప‌ర‌దేశి  జీవీ ప్ర‌కాశ్‌తో ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని అత‌ని అక్క‌య్య లిజో మోల్‌కు చెబుతుంది. ‘నాకు చెప్ప‌నే లేదే’ అని లిజోమోల్ అంటే. ‘ఇంకా మేమే చెప్పుకోనే లేదు’ అంటూ క‌శ్మీరా పర‌దేశి స‌మాధానం చెబుతుంది. ప్రేమ‌లో మ‌రో కోణాన్ని ఎలివేట్ చేసే ఈ రెండు డైలాగ్స్‌కు మ‌ధ్య,  సన్నివేశాలను చూపిస్తూ సిద్ధార్థ్‌, జీవీ ప్ర‌కాశ్ కుమార్‌ల క్యారెక్ట‌ర్స్ గురించి ద‌ర్శ‌కుడు శ‌శి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
త‌ర్వాత సినిమా మెయిన్ క‌థాంశాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. బైక్ రేసులంటూ తిరిగే యువ‌కుడి పాత్ర‌లో జీవీ ప్ర‌కాశ్ క‌నిపిస్తే.. న‌గ‌రంలో రేసర్స్‌ను ప‌ట్టుకునే ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో సిద్ధార్థ్ క‌నిపించున్నారు. వీరిద్ధ‌రి మ‌ధ్య ప్రొఫెష‌న‌ల్‌గా  ప‌ర్స‌న‌ల్‌గా ఉండే ట‌చ్‌ను చూపిస్తూ సినిమా ఉంటుంద‌నేది ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. దానికి త‌గిన‌ట్లు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసి ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తిని క్రియేట్ చేశారు బిచ్చ‌గాడు ఫేమ్ డైరెక్ట‌ర్ శ‌శి.
 
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. ఇలాంటి సమయంలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న మూవీ ‘ఒరేయ్ బామ్మర్ది’ని చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తుండటం హ్యాపీగా ఉంది. సిద్దార్థ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కూడా తెలుగువారికి సుపరిచితుడే. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశాం. ఇందులో  సిద్ధార్థ్, జీవి ప్రకాష్ కుమార్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఓ మంచి సినిమాను థియేటర్‌లో చూడాలనుకునే ప్రేక్షకులకు మా ‘ఒరేయ్ బామ్మర్ది’ మంచి ఆప్షన్ అవుతుంది’’ అన్నారు. 
 
 
నటీనటులు : 
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ , కశ్మీరా పరదేశి, లిజోమోల్ జోస్ తదితరులు
 
సాంకేతిక నిపుణులు : 
దర్శకుడు : శశి
బ్యానర్ : అభిషేక్ ఫిలిమ్స్
నిర్మాత : రమేష్ పి పిళ్లై
తెలుగు రిలీజ్ :  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ –  ఏ.ఎన్ బాలాజీ
సంగీతం : సిద్ధూ కుమార్
సినిమాటోగ్రఫీ : ప్రసన్న కుమార్
ఎడిటింగ్ : సాన్ లోకేష్