ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి ఫైనల్ థియేటర్ కౌంట్

Published On: December 19, 2017   |   Posted By:
ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి ఫైనల్ థియేటర్ కౌంట్
యూఎస్ఏ రిలీజ్ లో అజ్ఞాతవాసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రీతిలో అత్యధిక థియేటర్లు దక్కించుకున్నాడు. మొన్నటివరకు అమెరికాలో అజ్ఞాతవాసి థియేటర్ల కౌంట్ 547. ఇదే పెద్ద నంబర్ అనుకుంటే.. ఇప్పుడా సంఖ్య 570కి చేరింది. అవును.. అజ్ఞాతవాసి సినిమా అమెరికాలో ఏకంగా 570 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. జనవరి 9 నుంచే అక్కడ ప్రీమియర్స్ రూపంలో షోలు మొదలు కాబోతున్నాయి.
ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా ఇంత భారీస్థాయిలో అమెరికాలో విడుదలకాలేదు. బాహుబలి-2కు యూఎస్ లో 440 లొకేషన్లు దక్కాయి. దంగల్ కు 350, స్పైడర్ కు 210 లొకేషన్లు దొరికాయి. వీటితో పోలిస్తే అజ్ఞాతవాసి అందనంత ఎత్తులో ఉంది. మరీ ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ లో అమెరికాలో అజ్ఞాతవాసికి ఇన్ని థియేటర్లు దొరకడం నిజంగా గొప్ప విషయం